అప్ సెట్ అయ్యానంటున్న 'ఓం 3D'హీరోయిన్
నిఖిషా మాట్లాడుతూ... " 'ఓం 3D'చిత్రం మొదట అనుకున్న తేదీ కాకుండా 19 జూలైకు ఫోస్ట్ ఫోన్ అయ్యింది. అంటే నా పుట్టిన రోజుకు ఒక రోజు ముందన్నమాట. దానిఅర్దం..ఈ పుట్టిన రోజుని చిత్రం ప్రమేషన్ లో గడపాలి అన్నమాట..నేను చాలా అప్ సెట్ అయ్యాను," అంది.
కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..."ఉత్తేజాన్నిచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం మేళవింపుతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం. భారతదేశపు తొలి యాక్షన్ 3డి చిత్రమిది. విజయ్, రవివర్మ కంపోజ్ చేసిన యాక్షన్ సన్నివేశాల్ని 3డిలో చూడటం ప్రేక్షకులకి కొత్త అనుభూతినిస్తాయి. విదేశాల నుంచి ప్రత్యేకంగా కెమెరాలు, లెన్స్‌లు తెప్పించాం. ఓ యువకుడు తనకు ఎదురైన అనుభవాలు మూలంగా ఎలా మారాడు, ఎవరిపై విజయం సాధించాలని తపించాడు అన్నది చిత్రంలో ముఖ్యాంశం. 3డి, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన పనులు విదేళాల్లో చేశాం. ' అని తెలిపారు.
కళ్యాణ్ రామ్ అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశారు. స్టెప్ అప్3, ఫైనల్ డెస్టినేషన్, స్పైడర్‌మేన్4, అవతార్, రెసిడెంట్ ఈవిల్ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్ ఎపిక్, త్రీడీ రిగ్ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్ చేశాం. గత ఏడు నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి. ఈ చిత్రంతో సినిమాటోగ్రాఫర్ సునీల్‌రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్నారు. కృతి కర్బందా, నికిషా పటేల్ హీరోయిన్లు. యన్.టి.ఆర్. ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి అచ్చు, సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు.


Click it and Unblock the Notifications












