కళ్యాణ్ రామ్ ‘ఓం’ 3D రిలీజ్ డేట్...ఫైనల్
3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు. ఇటీవలే ఆడియో విడుదల చేసారు. కళ్యాణ్ కెరీర్లో ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఈ సినిమా గురించి కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ ''యాక్షన్ ప్రధానమైన కథ, కథనాలతో చిత్రం సాగుతుంది. ఆహ్లాదకరమైన వినోదం, వినసొంపైన సంగీతం జత కూడాయి. యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాన్ని త్రీడీలో చూపించడం కత్తి మీద సాములాంటిదే. చిత్రీకరణ మొదలుపెట్టడానికి ఎనిమిది నెలల ముందు నుంచీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాం.
అమెరికా నుంచి నిపుణులను తీసుకొచ్చి చిత్రీకరణ చేశాం. స్టెప్ అప్3, ఫైనల్ డెస్టినేషన్, స్పైడర్‌మేన్4, అవతార్, రెసిడెంట్ ఈవిల్ లాంటి చిత్రాలకు పని చేసిన అనుభవం వాళ్లకు ఉంది. రెడ్ ఎపిక్, త్రీడీ రిగ్ కెమెరాలు, లెన్స్‌లు అక్కడి నుంచే వచ్చాయి. సుమారు 150 రోజులపాటు షూటింగ్ చేశాం. కొన్ని నెలలుగా అమెరికా, సింగపూర్‌ల్లో త్రీడీ, విజువల్ ఎఫెక్ట్స్‌కి సంబంధించిన కార్యక్రమాలు నడుస్తున్నాయి. పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని విస్మయపరుస్తాయి' అన్నారు.
ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్‌టేలర్, మార్కస్, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.


Click it and Unblock the Notifications












