twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవన్నీ అబద్దాలే, అన్నీ బాహుబలి కావు, కన్నీళ్ళు పెట్టుకున్నా : కె.రాఘవేంద్రరావు (ఇంటర్వూ)

    నాగార్జున ప్రధాన పాత్రధారిగా ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రాన్ని తెరకెక్కించారు రాఘవేంద్రరావు. ఈ సందర్బంగా ఆయన ఇంటర్వూు ఇచ్చారు.

    By Srikanya
    |

    హైదరాబాద్ :అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన భక్తిరస చిత్రాలు అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి ప్రేక్షకుల్ని ఎంత రంజింపజేసాయో అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ వీరి కాంబినేషన్‌లో హాథీరామ్‌ బాబా ఇతివృత్తంతో రూపొందిన మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'.

    ''ఒక కథ విన్నప్పుడు ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలా? అనే ఉద్వేగం కలగాలి. నేను తీసే సినిమాలన్నింటికీ దాదాపు ఇలానే జరుగుతుంది. హాథీరామ్‌ బాబా గురించి భారవి చెప్పినప్పుడు వెంటనే షూటింగ్‌ మొదలుపెట్టేయాలన్నంత ఎగై్జట్‌మెంట్‌ కలిగింది'' అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అన్నారు.

    సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేంంద ‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. చిత్రాన్ని చూసిన సెన్సార్‌ సభ్యులు ఒక గొప్ప భక్తిరస చిత్రాన్ని రూపొందించారని దర్శకనిర్మాతలను ప్రశంసించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.

    గతంలో తన సినిమా కోసం పత్రికలకు ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వని రాఘవేంద్రరావు 'ఓం నమో వేంకటేశాయ' కోసం తొలిసారి తన ఆఫీసులో ఏకంగా 77 నిమిషాల సేపు మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

    బాపుకి రాని ఛాన్స్ ఆ రూపంలో ...

    బాపుకి రాని ఛాన్స్ ఆ రూపంలో ...

    నేను బాపు, విశ్వనాథ్‌గార్లకన్నా గొప్ప దర్శకుణ్ణి అనను. అయితే వాళ్లందరికీ రాని ఛాన్స్‌ నాకు 'అన్నమయ్య' రూపంలో వచ్చింది. భక్తిరసాత్మక చిత్రాలు తీయడం మాటల్లో చెప్పలేని తృప్తినిస్తుంది. 40 ఏళ్ల కెరీర్‌లో మొదట్లో ఓ ప్లానింగ్‌ ప్రకారం సినిమాలు తీసేవాణ్ణి అని అన్నారు.

    అదే జానర్ లో ..

    అదే జానర్ లో ..

    ఎన్టీఆర్‌తో 'అడవిరాముడు' వంటి సూపర్‌ హిట్‌ తీశాక, మళ్లీ అదే జానర్‌ అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆశిస్తారు కాబట్టి, 'జ్యోతి' తీశా. చిరంజీవితో 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' తీశాక, మోహన్‌బాబు హీరోగా 'అల్లుడుగారు' తీశాను. కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు వచ్చారు.

    బిజినెస్ ప్లాన్ ....

    బిజినెస్ ప్లాన్ ....

    ‘‘నాన్నగారు (దర్శకుడు కె.ఎస్‌. ప్రకాశరావు) పదేళ్లు అడ్వాన్సడ్‌గా ఆలోచించి సినిమా తీసేవారు. నేనేమో ఎవరికి ఏం కావాలో ఆలోచించి తీస్తూ వచ్చాను. ఇది బిజినెస్‌ ప్లాన్ లాంటిదే. కాకపోతే నేనెప్పుడూ డబ్బుకోసమని డైరెక్షన్ చెయ్యలేదు. మంచి సినిమా తియ్యాలనుకుంటాను'' అని చెప్పారు రాఘవేంద్రరావు.

    ఏం వేటగాడు,,ఏం అడివిరాముుడు అనిపించింది

    ఏం వేటగాడు,,ఏం అడివిరాముుడు అనిపించింది

    రెండే రెండు సందర్భాల్లో ఇలాంటి సినిమాలు మనం చెయ్యలేకపోయామేనని అనిపించింది. ఒకటి ‘గాంధీ', రెండు ‘భాగ్‌ మిల్ఖా భాగ్‌' సినిమాల విషయంలో. మనల్ని బానిసలుగా చూసినవాళ్లు, వాళ్లే నటించి, మనకన్నా గొప్పగా ‘గాంధీ'ని తీశారు. దాన్ని చూసినప్పుడైతే ‘ఏం వేటగాడు, ఏం అడవిరాముడు' అనిపించింది. అయితే అవి తియ్యకపోతే అన్నగారితో నా జర్నీ అంత బాగా సాగేది కాదనుకోండి! ఇక ఒక డాక్యుమెంటరీ లాంటి మిల్ఖాసింగ్‌ కథని ఇంటరెస్టింగ్‌గా అద్భుతమైన స్ర్కీనప్లేతో ఎమోషనల్‌గా తీశారు.

    అండర్ కరెంట్ గా..

    అండర్ కరెంట్ గా..

    ‘డైరెక్టర్‌గారూ.. దీన్ని మీ లాస్ట్‌ సినిమా అనడానికి వీల్లేదు. తర్వాత మంచి సోషల్‌ సినిమా తియ్యాల్సిందే. మేం ఉన్నాం. కావాలంటే రూ. 200 కోట్లు పెడతాం' అంటున్నారు స్నేహితులు. వాళ్లన్నారని ఏదో ఒకటి తియ్యకూడదు కదా. సోషల్‌ సినిమా తీసినా, కమర్షియల్‌గా ఉంటూ అండర్‌కరంట్‌గా మంచి మెసేజ్‌ కూడా ఉండాలి. ఒక స్థాయికి వచ్చాక డబ్బుకు విలువుండదు. వచ్చిన పేరును ఎలా పెంచుకుంటూ వెళ్లాలన్న ఆలోచనే ఉంటుంది. అమీర్‌ఖాన ‘దంగల్‌' అందుకు మంచి ఉదాహరణ.

    చెప్తాను సోదరా...

    చెప్తాను సోదరా...

    మోహన్ బాబును ‘రావణ' గురించి అడిగినప్పుడల్లా ‘‘చెబుతాను సోదరా'' అంటున్నాడు. అది అద్భుతమైన స్ర్కిప్టు. దాన్ని మోహనబాబు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఆ డైలాగ్స్‌ను ఆయనే చెప్పగలడు. ఇంగ్లీష్‌లో టైటిల్‌ పెట్టాల్సి వస్తే.. ‘రావణ.. ద ఫ్యామిలీమేన్' అని పెట్టొచ్చు. ఎందుకంటే రావణుని కథలో సిస్టర్‌ సెంటిమెంట్‌, మదర్‌ సెంటిమెంట్‌ వంటివి ఉన్నాయి. ఆయన కోడలు మహాభక్తురాలు.

    టాప్ టెక్నీషియన్ వరకూ...

    టాప్ టెక్నీషియన్ వరకూ...

    ఇది నాకు వేంకటేశ్వరనామ సంవత్సరం. టీటీడీ బోర్డు సభ్యునిగా కొనసాగుతూ, ‘ఓం నమో వేంకటేశాయ' తీశాను. ఆఫీస్‌ బాయ్‌ నుంచి టాప్‌ టెక్నీషియన్ వరకూ యూనిట్‌లో ఉన్నవాళ్లందరం భక్తిభావంతో ఈ సినిమా చేశాం. చెప్పాలంటే ఇది ఓ ఆధ్యాత్మిక ప్రయాణం. అప్పుడప్పుడూ ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి.

    గ్రాఫిక్స్ చేసాం...

    గ్రాఫిక్స్ చేసాం...

    15వ శతాబ్దం కాలం నాటి గుడులెలా ఉన్నాయనేదానిపై పరిశోధన చేశాం. ఎక్కడా తిరుపతి గుడికి సరిపోలే గుడి కనిపించలేదు. దాంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో కొంత సెట్‌వేసి, మిగతా దాన్ని గ్రాఫిక్స్‌లో చేశాం. అధ్బుతమనండి.. మహిమనండి.. ఊరంతా వర్షం కురుస్తుంటే ఫిల్మ్‌సిటీలో వర్షం కురిసేది కాదు. దాంతో షూటింగ్‌ సజావుగా జరిగిపోయేది. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడే మహాబలేశ్వరంలో మేం బ్రహ్మోత్సవాల పాట చిత్రీకరించాం. అనుష్కతో దుర్గాదేవి పాటను తీస్తున్నప్పుడే దుర్గాష్టమి వచ్చింది. అలా సినిమా అంతా మహిమలతో సాగింది. నాస్తికుడెవరైనా ఉన్నా ఆస్తికుడిగా మారిపోయేంత విధంగా సంఘటనలు జరిగాయి.

    మొదట సందేహించినా

    మొదట సందేహించినా

    మహాభక్తుడు హాథీరామ్‌బాబా పాత్ర చేస్తే నాగార్జునే చెయ్యాలి. ఆయన కాకుండా ఇంకెవరైనా దాన్ని చెయ్యడానికి ఒప్పుకుంటారా? అనేది కూడా ఓ ప్రశ్న. అప్పుడు చిరంజీవిగారు 150వ సినిమా చేసే పనిలో ఉన్నారు. ఆయన ఇలాంటిది ఎందుకు చేస్తారు? మొదట సందేహించినా కథ విన్నాక వెంటనే ఒప్పేసుకున్నారు నాగార్జున.

    ‘కలియుగ వైకుంఠం’ ఎందుకయ్యింది?

    ‘కలియుగ వైకుంఠం’ ఎందుకయ్యింది?

    ఈ సినిమాను అన్ని వర్గాలవాళ్లతో పాటు యువత కూడా చూస్తారనేది నా నమ్మకం. తిరుపతిలో చూస్తే కాలినడక యాత్రలో ఎక్కువమంది యువతే ఉంటారు. ప్రపంచంలోనే అత్యధిక పేరు ప్రఖ్యాతులు పొందిన పుణ్యక్షేత్రం తిరుపతి. అది ‘కలియుగ వైకుంఠం' ఎందుకయ్యింది? ఆ క్షేత్ర మహాత్యం ఏమిటి? ఏడు కొండలనేవి ఏమిటి? అనే విషయాలు ఈ సినిమాలో చూపించాం.

    అక్కడికి వెళ్లాలని ఆశిస్తాను

    అక్కడికి వెళ్లాలని ఆశిస్తాను

    ఈ సినిమా చూశాక అదివరకు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్లినవాళ్లు కూడా మరోసారి అక్కడకు వెళ్లాలని ఆశిస్తారు. మామూలుగా దేవుడ్ని దర్శనం చేసుకుని రావడం వేరు, ఆ క్షేత్ర మహాత్యం తెలుసుకొని వెళ్లడం వేరు.

    అనుష్క పాత్రనే

    అనుష్క పాత్రనే

    ‘అన్నమయ్య'కూ, ఈ సినిమాకూ తేడా అనుష్క పాత్ర. ఆమె నాగార్జునకు జోడీ కాకపోవడం విశేషం. సాధారణంగా హీరో హీరోయిన్లంటే జంటే. ఇందులో అలా కాదు. హాథీరాం ఓ మహాభక్తుడైతే, కృష్ణమ్మ మరో మహాభక్తురాలు. కృష్ణమ్మ పాత్ర కల్పితం. నా సినిమా అంటే హీరోయిన, పూలు, పళ్లు ఉంటాయనేది అందరికీ తెలుసు. ఇందులో పూలు, పళ్లు అన్నీ స్వామివారికే. భగవంతుడికన్నా భక్తుడు గొప్పవాడు అని స్వామి చెప్పడంతో హాథీరామ్‌బాబా పాత్ర బాగా ఎలివేట్‌ అవుతుంది.

    జగపతిబాబుది..

    జగపతిబాబుది..

    జగపతిబాబుది ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే అతిథి పాత్ర. ఆయన పాత్రకూ, అనుష్క పాత్రకూ సంబంధమేంటనేది అందులో చూపించాం. రెండు సీన్లయినా చేస్తానని ఆయన ముందుకొచ్చి చేశాడు. హాథీరామ్‌ బ్రహ్మచారి. కాకపోతే ఒకామెను ఆయన పెళ్లాడాలనుకున్నాడనే విషయం ఓ పుస్తకంలో లభించింది. దాన్ని ఆధారం చేసుకొని ప్రగ్యా జైస్వాల్‌ పాత్రను కల్పించాం. అలా ఆమె కాంబినేషనతో ఓ పాటను తీశాం.

    అంత అద్బుతంగా చేసాడు

    అంత అద్బుతంగా చేసాడు

    ఇప్పటివరకూ అనుష్క చేసిన పాత్రలు వేరు, ఇందులో చేసిన కృష్ణమ్మ పాత్ర వేరు. తొలిసారిగా భక్తురాలి పాత్ర వేసింది. అరుంధతి, రుద్రమదేవి, దేవసేన వంటి పాత్రలు చేసినా, వాటికిది భిన్నం. వేంకటేశ్వరస్వామిగా సౌరభ్‌జైన చాలా ముద్దుగా ఉన్నాడు. ఉత్తరాదిలో అతను బాగా పాపులర్‌. ‘మహాభారత'లో శ్రీకృష్ణునిగా వేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతను కనిపిస్తే కాళ్లమీద పడుతుంటారు జనం. అద్భుతంగా చేశాడు.

    యూత్ ఎంత ముందున్నా

    యూత్ ఎంత ముందున్నా

    అలాగే, దేవుణ్ణి చూసే విధానంలో కూడా మార్పొస్తుంది. భక్తి సినిమాలను యూత్‌ కూడా చూస్తున్నారు. తిరుమలకు కాలి నడకన వెళ్లేవాళ్లల్లో యూత్‌ ఎక్కువగా ఉన్నారు. ఎగ్జామ్స్‌ పాస్‌ అవ్వాలనో, ఉద్యోగం రావాలనో... స్వామివారిని దర్శించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా యూత్‌ ఎంత ముందున్నా.. చరిత్ర కూడా తెలుసుకోవాలి. మన సంస్కృతి, సంప్రదాయాల మీద అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సినిమాల వల్ల అవి తెలుస్తాయి.

    ఆశ్చర్యపోతారు

    ఆశ్చర్యపోతారు

    600 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రతో ఈ సినిమా తీశాం. అప్పట్లో తిరుమల ఎలా ఉండేది? అని ఊహించి, సెట్స్‌ వేశాం. కొంత గ్రాఫిక్స్‌ వర్క్‌ చేశాం. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు జరిగిన కొన్ని మహిమల గురించి చెబితే, ఆశ్చర్యపోతారు.

    ఆస్దికులుగా మారతారు

    ఆస్దికులుగా మారతారు

    మేం సెట్స్‌ వేసిన ప్రదేశానికి కొంత దూరంలో భారీగా వర్షం కురిసేది. మా దగ్గర మాత్రం ఉండేది కాదు. వింతగా అనిపించేది. బ్రహ్మోత్సవాల సీన్స్‌ తీసేటప్పుడే తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగాయి. అలాగే, అనుష్క చేసిన దుర్గా దేవి సీన్స్‌ చిత్రీకరణ అప్పుడు దుర్గాష్టమి పండగ. ఇవన్నీ చూసి, నాస్తికులు కూడా ఉంటే ఆస్థికులుగా మారిపోతారేమో అనిపించింది.

    చిన్న సీన్ లో ...

    చిన్న సీన్ లో ...

    నాతో ఆయన 'శిరిడిసాయి' తీసిన తర్వాత, 'మళ్లీ మీరు నాగార్జునతో ఆధ్యాత్మిక సినిమా చేయాలంటే నాకే చెప్పండి' అన్నారు. అప్పుడే.. అంటే నాలుగైదేళ్ల క్రితమే జేకే భారవి ఈ హాథీరామ్‌ బాబా గురించి చెప్పారు. ఇప్పటివరకూ ఈ పాయింట్‌ని ఎవరూ టచ్‌ చేయలేదు. ఎన్టీ రామారావుగారు 'శ్రీ వెంకటేశ్వర మహత్యం'లో చిన్న సీన్‌లో హాథీరామ్‌ బాబా గురించి చెప్పారు. నేటి తరానికి, భవిష్యత్‌ తరాలకు మన చరిత్ర గురించి చెప్పాలని 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' తీశాను. ఇప్పుడు ఈ సినిమా కూడా అందుకే తీశాం.

    ప్రసాదం తిన్న తర్వాతే...

    ప్రసాదం తిన్న తర్వాతే...

    భక్తి సినిమా తీసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. మొత్తం యూనిట్‌ అంతా చాలా నిష్టగా ఉండేవాళ్లం. ఉదయం ప్రసాదం తిన్న తర్వాతే టిఫిన్‌ తినేవాళ్లం. సాయంత్రం ప్యాకప్‌ చెప్పగానే.. ఏడుకొండలవాడా.. గోవిందా.. గోవిందా అని అందరూ అంటుంటే, తిరుమల క్షేత్రంలో ఉన్న భావన కలిగేది.

    నాన్న బ్రతికుంటే బాగుండేది

    నాన్న బ్రతికుంటే బాగుండేది

    ఆధ్యాత్మిక చిత్రాలు, కమర్షియల్‌ సినిమాలు, చిన్న సినిమాలు.. ఒక్కోటీ ఒక్కో విధమైన అనుభూతినిచ్చాయి. అనుకున్న దానికి మించి ఎక్కువ గుర్తింపువస్తే ఆనందం కలిగింది కానీ అహంకారం, పొగరు వంటివి రాలేదు. ‘అన్నమయ్య' చేశాక నాన్న ఫొటోముందు నిల్చొని ఈ సినిమా చూసేంతవరకైనా బతికుంటే బాగుండేదని కన్నీళ్లు పెట్టుకున్నా. ఆ సినిమా మొదలు పెట్టినప్పుడు ఆయనున్నారు. మధ్యలో వెళ్లిపోయారు.

    అన్ని అబద్దాలే

    అన్ని అబద్దాలే

    గురువు వేరు, దేవుడు వేరు. షిర్డీసాయి గురువు కోవకు చెందినాయన. ఎవరికెంత ఇవ్వాలో అంతే ఇస్తుంటారాయన. ‘శిరిడిసాయి' సినిమాకు ఎంతివ్వాలనుకున్నారో అంతే ఇచ్చారు. ఆ సినిమా చేసేప్పుడు సాయి గెటప్‌‌‌లో నాగార్జున ఉంటే, నా పక్కన సాయి ఉన్నట్లే అనిపించేది. కమర్షియల్‌గా ఆ సినిమాకు అంతగా రాలేదంటారు. అవన్నీ అబద్ధాలు. ఆ సినిమాకు నష్టమేం జరగలేదు. మంచి పేరొచ్చింది.

    చిరంజీవి అలా అంటారు

    చిరంజీవి అలా అంటారు

    ‘అన్నమయ్య', ‘శ్రీరామదాసు' సినిమాలు ‘బాహుబలి' అంత కలెక్ట్‌ చేయవు. కానీ గొప్ప పేరు వచ్చింది. చిరంజీవిగారు నాగార్జునను, నన్ను ఎప్పుడూ అంటుంటారు - ‘‘మేం ఎన్ని సినిమాలు చేసినా లాభమేముందండీ. మీరు చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశారు'' అని.

    ఒరిజనల్ ఆర్టిస్టులు

    ఒరిజనల్ ఆర్టిస్టులు

    చిరంజీవి ‘శ్రీమంజునాథ'లో వృద్ధుడి గెటప్‌‌‌లో ఎంత అద్భుతంగా చేశారు! నిజంగా నాకు కన్నీళ్లు వచ్చాయి. వీళ్లంతా ఒరిజినల్‌గా ఆర్టిస్టులు. స్టార్‌డమ్‌ వచ్చాక ఓ పరిధి ఏర్పడుతుంది. నా దృష్టిలో ఎవరైనా ఈ పాత్రలు చేయగలరు. ఇప్పుడున్న డైరెక్టర్లు ఎవరైనా వాటిని తియ్యగలరు.

    తప్పులేదు

    తప్పులేదు

    మంచి విషయం చెప్పడానికి కొన్ని కల్పితాలున్నా తప్పులేదు. ప్రజలకు అందాల్సింది మంచే. ‘అన్నమయ్య' నుంచే ఎంతో కొంత భక్తిభావం మొదలైంది. ‘ఓం నమో వేంకటేశాయ' చూశాక తిరుపతికీ, వేంకటేశ్వరస్వామికీ మరింత ఎక్కువమంది అనుసంధానమవుతారు. పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు వంటివాటితో మనకున్నంత సాహిత్య సంపద ఏ దేశానికీ లేదు. వాటిని నేటి తరం మరచిపోతోంది. ఎంతోమంది గొప్ప వ్యక్తుల కారణంగానే ఈ దేశం ఇలా ఉందనేది వాళ్లకు తెలియాలి.

    ఇంకా బ్రహ్మాండంగా తీస్తారు

    ఇంకా బ్రహ్మాండంగా తీస్తారు

    ఇలాంటి సినిమాలు రాఘవేంద్రరావు మాత్రమే తీస్తాడనే మాటను నేనొప్పుకోను. ఇప్పుడున్న టాప్‌ డైరెక్టర్లందరితో పాటు కొత్త డైరెక్టర్లు కూడా ఈ సినిమాలు చేయతగ్గవాళ్లే. మా తరం కంటే వాళ్లింకా బ్రహ్మాండంగా తియ్యగలరు. ఇందులో దిగితేనే కానీ అవి తీయడంలోని ఆనందం అర్థం కాదు. వాళ్లు తీసేదీ కథే, ఇదీ కథే. కాకపోతే కాస్త లోతుగా చదువుకొని చెయ్యాలంతే. వాళ్లని ఇవే తియ్యమని చెప్పడం లేదు. మన భాష, మన సంస్కృతీ సంప్రదాయాలు, మన పురాణాలకు సంబంధించి ఏడాదికి ఒక్కటైనా సినిమా వస్తే బాగుంటుంది.

    ఎమోషన్ అయ్యారు

    ఎమోషన్ అయ్యారు

    లేకపోతే ఒక గొప్పవాడు ఆ స్థాయికి ఎలా ఎదగాడనే విషయాన్ని చూపిస్తూ బయోపిక్స్‌ తీయొచ్చు. దేవుడు ఓ భక్తుడితో కలిసి కబుర్లు చెబుతూ పాచికలాడాడనే కథ కలియుగంలో మరెక్కడా జరగలేదు. కేవలం ఐదొందల ఏళ్ల క్రితమే జరిగిన కథ. అంతకంటే గొప్ప అనుభూతి ఏముంటుంది! ఆ సన్నివేశాలు తీస్తుంటే ఛాయాగ్రాహకుడు ఎస్‌. గోపాల్‌రెడ్డి కళ్లవెంట నీళ్లు వచ్చాయి. నేను కట్‌ చెప్పడం మర్చిపోయాను. చాలా చోట్ల నాగార్జున భావోద్వేగానికి గురయ్యారు. సాధారణంగా భగవంతుడికి భక్తుడు తన కష్టాలు చెప్పుకుంటాడు. ఈ సినిమాలో భక్తుడికి భగవంతుడు తన కష్టాలు చెప్పుకుంటుంటాడు. ఆ సన్నివేశాలు భారవి చాలా గొప్పగా రాశారు. ఆయన రచన, కీరవాణి సంగీతం పోటీపడ్డాయి. కీరవాణి సంగీతమైతే సినిమాకు ప్రాణంలా నిలిచింది.

    ఓపిక ఉన్నంత వరకూ

    ఓపిక ఉన్నంత వరకూ

    ఇది నా చివరి చిత్రం కాబోదు. మొదట్నించీ నచ్చితేనే నేను సినిమా తీస్తాను. నాలో ఓపిక ఉన్నంతవరకూ చేస్తా. పనినెప్పుడూ నేను నిర్లక్ష్యం చెయ్యను. అయినా మన చేతుల్లో ఏముంటుంది! ముప్పై ఆరేళ్లపాటు వరుసగా ఏడాదికి కనీసం ఒక్క సినియా అయినా చేసిన డైరెక్టర్‌ని నేను. అయినా సెలక్టివ్‌గా ఉంటా. సినిమా ఆడొచ్చు, ఆడకపోవచ్చు. ఎప్పుడు ఈ సినిమా తీద్దామా అని ఏ స్ర్కిప్టు విన్నప్పుడు అనిపిస్తుందో, దాన్ని తియ్యాలనుకుంటాను.

    స్వామే నాకిచ్చాడు

    స్వామే నాకిచ్చాడు

    కెరీర్‌ మొదట్లో ప్లాన్ చేసేవాడ్ని. ‘అడవిరాముడు' తర్వాత చిన్న సినిమా ‘జ్యోతి' తీశాను. అలా కాకుండా ఇంకేదైనా రాముడంటూ రామారావుగారితోనే ఇంకో సినిమా తీస్తే, పోలిక వస్తుంది. అలాగే ‘జగదేకవీరుడు అతిలోకసుందరి' సినిమా చేశాక ‘అల్లుడుగారు' తీశాను. విలనగా చేస్తున్న మోహనబాబు హీరోగా సినిమా ఏమిటని అందరూ అనుకున్నారు. సమయానుకూలంగా అలాంటి నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాను. ‘అన్నమయ్య'కు అలా జరగలేదు. దాన్ని డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని స్వామే నాకిచ్చాడనుకుంటాను. ఆ సినిమా చేశాక రాజమండ్రికి వెళ్లినప్పుడు ‘‘అన్నమయ్య అంటే ఇప్పటివరకూ మాకు తెలీదండి. మీ సినిమా వల్ల తెలుసుకున్నాం'' అని స్టూడెంట్స్‌ అంటే చాలా ఆనందమేసింది.

    ఇలా ఉండేదా...

    ఇలా ఉండేదా...

    ఏడు కొండలు అంటాం కానీ, వాటి ప్రాశస్త్యం గురించి చాలామందికి తెలియదు. అది ఈ సినిమాలో చెప్పాం. ఎవరికీ తెలియని కొత్త కొత్త విషయాలు చాలా చెప్పాం. ఇప్పటివరకూ తిరుమల వెళ్లినవాళ్లు ఈ సినిమా చూశాక వెళితే అక్కడి పరిసర ప్రాంతాలను వేరే దృక్పథంతో చూస్తారు. 'ఇక్కడ ఇలా జరిగిందా? ఇలా ఉండేదా?' అని ఆసక్తిగా చూస్తారు.

    కట్ చెప్పటం మర్చిపోయేవాడ్ని

    కట్ చెప్పటం మర్చిపోయేవాడ్ని

    'అన్నమయ్య' కన్నా గొప్ప సినిమా రాదని చెప్పిన నాగార్జున కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ చిత్రానికి ఓకే చెప్పారు. ఇక, నటన అంటారా? అద్భుతం. ఎమోషనల్‌ సన్నివేశాల్లో గ్లిజరిన్‌ అవసరం లేకుండా ఆయనకు కన్నీళ్లు వచ్చేసేవి. అంతగా లీనమైపోయారు. ఒక్కోసారి కెమేరామేన్‌ ఎస్‌. గోపాల్‌రెడ్డి కెమేరా ఆన్‌లోనే ఉంచి.. అలా చూస్తుండిపోయేవారు. నేను 'కట్‌' చెప్పడం మరచిపోయేవాణ్ణి. అంత ఉద్వేగానికి గురయ్యేవాణ్ణి. కన్నీటితో ఆనందపడేవాణ్ణి.

     శ్రీమంతుడు చిత్రం నచ్చింది

    శ్రీమంతుడు చిత్రం నచ్చింది

    ఈ మధ్య కొరటాల శివ తీసిన 'మిర్చి', 'శ్రీమంతుడు' నచ్చాయి. ఒక కమర్షియల్‌ సినిమాలో సమాజానికి ఉపయోగపడే విషయం చెప్పాడు. తీసే సినిమాలో ప్రయోజనాత్మక అంశం ఉంటే బాగుంటుందంటున్నా.

    English summary
    On the occasion of the Om Namo Venkatesaya film’s release, we caught up with Legendary director, K Raghavendra Rao for a detailed interview. Here is the transcript.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X