»   » ఇంట్రెస్టింగ్: రాఘవేంద్రరావు గడ్డం వెనక అసలు సంగతి

ఇంట్రెస్టింగ్: రాఘవేంద్రరావు గడ్డం వెనక అసలు సంగతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఆయన సినిమాల్లో రక్తిరసం ఎంతబాగా పండిస్తారో...భక్తి రసం కూడా అంతే చక్కగా చూపిస్తారు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డీ సాయి బాబా వంటి భక్తి చిత్రాల తర్వాత ఆయన దర్శకత్వంలో వస్తున్న మరో సినిమా 'నమో వెంకటేశ'.

ఈ మూడు సినిమాలకు రాఘవేంద్రరావు, నాగార్జున, కీరవాణి కలిసి పని చేసారు. 'నమో వెంకటేష' సినిమాకు వీరు నాలుగో సారి కలిసి చేస్తున్నారు. జూన్ 25న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ట్విట్టర్లో తన గడ్డం లేని తాజా ఫోటో పోస్టు చేసారు.

తన గడ్డం లేని ఫోటోను పోస్టు చేయడంతో పాటు ఓ విషయం వెల్లడించారు. జ్యోతి సినిమా సమయంలో ఓ సాంప్రదాయం మొదలు పెట్టాను. అప్పటి నుండి నా ప్రతి సినిమా మొదలు పెట్టినపుడు గడ్డం తీసేసి...షూటింగ్ పూర్తయిన రోజునే మళ్లీ తీస్తాను. అదే సాంప్రదాయాన్ని నమో వెంకటేశాయ సినిమాకు కొనసాగించాలనుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.

రాఘేవంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన రాజమౌళి కూడా ఇదే పాలసీ ఫాలో అవుతున్నారు. బాహుబలి సినిమా సమయంలో రాజమౌళి భారీగా గడ్డం పెంచిన సంగతి తెలిసిందే.

English summary
The shoot of Om Namo Venkateshaya has been decided to be June 25. This was revealed by K Raghavendra Rao today morning. He was there in Tirumala to have a darshan of the Lord along with Akkineni Nagarjuna and lyricist Sirivennela Sitharama Sastry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu