twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదెక్కడి గోల :ఓంపురి ని ప్రధాని మోడీ హత్య చేయించారా? టీవీ ఛానెల్ కథనం,అంతా షాక్

    ఓంపురి ని ప్రధాని మోడీ చంపించారంటూ పాక్ కి చెందిన ఓ టీవీ ఛానెల్ ప్రసారం చేసింది.

    By Srikanya
    |

    ముంబయి: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు ఓంపురి(66) కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే సహజంగా జరిగిన ఈ మృతి వెనక ఓ పెద్ద కుట్ర ఉందని పాకిస్దాన్ కు చెందిన టీవి ఛానెల్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఆ కుట్ర చేసింది ప్రధాని నరేంద్ర మోడి అని చెప్తూ ఓ పోగ్రాం ప్రసారం చేసింది.

    పూర్తి వివరాల్లోకి వెళితే... ఓంపురిది స‌హజ మ‌ర‌ణం కాదని, ఆయ‌న‌ను హ‌త్య చేశారాఅంటోంది పాకిస్థాన్‌కు చెందిన బోల్‌టీవీ అనే చాన‌ల్‌. ఓంపురి హ‌త్య వెన‌క మోదీ హ‌స్తం ఉంద‌ని ఆరోపించింది. పాకిస్థాన్ క‌ళాకారుల‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంతో జీర్ణించుకోలేని మోదీ ఓంపురిని చంపించార‌ని పేర్కొంది. అయితే ఇది హాస్యాస్ప‌ద క‌థ‌నం కావ‌డం గ‌మ‌నార్హం.

    ఓంపురి మృతి వెన‌క ప్ర‌ధాని మోదీ, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ హ‌స్త‌ముంద‌ని బోల్ టీవీ ప్ర‌సారం చేసిన 'ఐసీ నహీ చ‌లేగా' అనే హాస్య‌స్ప‌ద క‌థ‌నంలో పేర్కొంది. త‌న వ‌ద్ద‌కు రావాల్సిందిగా దోవ‌ల్ ఇటీవ‌ల ఓంపురికి క‌బురు పెట్టార‌ని పేర్కొన్న చాన‌ల్ ఆయ‌న ఇంటికి రాగానే పీక‌ల‌దాకా మ‌ద్యం తాగించారని క‌థ‌నంలో పేర్కొంది. త‌ర్వాత అక్క‌డే ఆయ‌న దుస్తులు మొత్తం ఊడ‌దీసి చిత‌క్కొట్టార‌ని వివ‌రించింది.

    ఉరీ అమ‌ర జ‌వాను నితిన్ యాద‌వ్ గ్రామానికి ఓంపురిని తీసుకెళ్లి సైనికుల‌పై తాను చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందిగా ఆదేశించార‌ని పేర్కొంది. వారు కొట్టిన దెబ్బ‌ల‌కు త‌ట్టుకోలేకే ఓంపురి మృతి చెందార‌ని, ఆయ‌న మృత‌దేహంపై ఆయ‌న‌ను చంపిన వ్య‌క్తి ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని చాన‌ల్ పేర్కొంది. అంతేకాదు వాటిని ద‌గ్గ‌రుండి చూసిన‌ట్టు పేర్కొంది.

    'Om Puri died because of Narendra Modi, Ajit Doval': Pak TV anchor's conspiracy theory

    ఆ ఛానెల్ అక్కడితో ఆగకుండా...ఇప్పుడు మోదీ లిస్టులో పాకిస్థాన్ న‌టుడు ఫ‌వాద్‌ఖాన్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్ కూడా ఉన్నార‌ని పేర్కొన్న చాన‌ల్ వారు ముస్లింలు కావ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని వివ‌రించింది.

    ఓంపురి(66) మొన్న శుక్రవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో సృగృహంలోనే ప్రాణాలు విడిచారు. బాలీవుడ్‌తో పాటు పలు హాలీవుడ్‌, పాకిస్థాన్‌ చిత్రాల్లో ఆయన నటించారు. తెలుగులో 'అంకురం' చిత్రంలో నటించారు. అద్భుత నటనతో పలుసార్లు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఓంపురి మరణంతో బాలీవుడ్‌ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది.

    ఓంపురి హరియాణాలోని అంబాలా ప్రాంతంలో పంజాబీ కుటుంబంలో అక్టోబర్‌ 18, 1950లో జన్మించారు. పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూల్‌ ఆఫ్‌ ఇండియాలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.

    1976లో మరాఠీ చిత్రం 'ఘాశీరామ్‌ కొత్వాల్‌'తో సినీరంగ ప్రవేశం చేశారు. 1982లో 'ఆరోహణ్‌', 1984లో 'అర్ధ్‌ సత్య' చిత్రాలకు గానుఆయన జాతీయ ఉత్తమనటుడు అవార్డులు అందుకున్నారు. 1990లో భారత ప్రభుత్వం నుంచి 'పద్మశ్రీ' పురస్కారం పొందారు. ఎనిమిది సార్లు ఫిలింఫేర్‌ అవార్డులు అందుకున్నారు.
    ప్రముఖుల సంతాపం

    ఓంపురి మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. నాటకాలు, సినిమాల్లో ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. సోషల్‌మీడియా ద్వారా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.ఇది షాకింగ్‌ న్యూస్‌ అని, ఓ గొప్ప, తెలివైన నటుడిని సినీ రంగం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు... అనుపమ్‌ఖేర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఖుష్బూ, రితేష్‌ దేశ్‌ముఖ్‌ తదితరులు ట్విట్టర్‌ ద్వారా సంతాపం తెలిపారు.

    English summary
    A Pakistani TV anchor has been promulgating a conspiracy theory about what caused the veteran actor Ompuri's demise. As per the anchor — Amir Liaqat — Puri was killed at the behest of Indian prime minister Narendra Modi and national security advisor Ajit Doval.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X