twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్షమించండి, నీచంగా మాట్లాడాను: నటుడు ఓంపురి కన్నీరు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి తన వివాదాస్పద కామెంట్లతో ఇటీవల విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దేశ రక్షణలో నిత్యం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్‌ దేశ పౌరులందరికీ ఆగ్రహం తెప్పించింది.

    యూరి ఘటన తర్వాత ఓంపురి ఓ ఇంటర్వ్యూలో సైనికుల గురించి మాట్లాడుతూ వారిని ఆర్మీలో ఎవరు చేరమన్నారు, ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు.. అంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

    Om Puri

    తన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో....తన ప్రవర్త ఎంత పెద్ద తప్పో తెలుసుకున్న ఆయన వెంటనే తన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడంతో క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన తన 66వ పుట్టినరోజు సందర్భంగా బారాముల్లా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్‌ఎఫ్‌ జవాను నితిన్‌ యాదవ్‌ ఇంటికి వెళ్లి భావోద్వేగాని గురై కంటతడి పెట్లారు.

    ప్రస్తుతం నితిన్ యాదవ్ కుటుంబం కాన్పూర్‌ ఉండటంతో అక్కడికి వెళ్లిన ఓంపురి జవాన్ కుటుంబీకులను పరామర్శించారు. ప్రార్థన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓంపురి కన్నీరుమున్నీరవుతూ తాను సైనికులను ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలిన మరోసారి వేడుకున్నారు.

    English summary
    In an act of repentance over his recent derogatory comments on Indian soldiers killed in the Uri terror attacks, actor Om Puri visited the Nagla Bari, Etawah residence of BSF jawan Nitin Yadav, who was martyred in the Baramulla attack, and took part in a hawan' ceremony organised for the departed soul.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X