సీనియర్ ఆర్టిస్టు సెక్సవల్ రిలేషన్స్‌ని బార్యే బయిటపెట్టి అల్లరి చేస్తోంది
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఓంపురి పరిస్దితి చాలా ఘోరంగా తయారైంది. ఇంట్లో ఈగల మోత,బయిట పల్లకీ మోతలా ఆయన సినీ జీవితం అద్బుతంగా ఉంటే పర్శనల్ లైఫ్ పరమ నీచంగా కంపుకొడుతోంది. ఆయనకు అఫీషియల్ గా ఇద్దరు భార్యలు. వారిద్దరూ ఎప్పుడూ తగువు పడుతూ ఆయన్ని రోడ్డుపై రోజూ పడేస్తూంటారు. ఆ మధ్యన ఆయన రెండో బార్య జర్నలిస్టు అయిన నందితాపూరి ఆయన జీవితంపై ఓ పుస్తకం రాసేసి మరీ ఇరుకున పెట్టేసింది. ఆ పుస్తకం పేరు అన్ లైక్లీ హీరో..ది స్టోరీ ఆఫ్ ఓంపురి. అందులో ఓంపురి తమ ఇంట్లో ఉన్న 14 సంవత్సరాల పనామ్మాయితోనూ, లక్ష్మి అనే మరొక ఆవిడతోనూ అక్రమ సంభందాలు పెట్టుకున్నాడని రాసేసింది.పుస్తకం రిలీజయ్యాక ఓంపురి అది నాబార్య పుస్తకం అమ్ముకోవటానికి వేసిన ఛీప్ ట్రిక్ అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు.
ఇక ఇప్పుడు కథ మరో మలుపు తిరిగింది. మాజీ భార్య సీమాకపూర్ , ప్రస్తుత భార్య నందితాపూరి మధ్య గొడవ జరుగుతుండటంతో ఓంపూరి తల పట్టుకుని కూర్చోవాల్సి వస్తుంది. ఈ మధ్య ఒకరోజున ప్రస్తుత భార్య నందితాపూరి కోపాన్ని ఓంపూరి చవిచూడాల్సి వచ్చిందట. దానికి కారణం ఓంపురీని మాజీ భార్య సీమా కపూర్ ఇంటివద్ద నందిత చూడటమే. దాంతో నందిత ఒక్కసారి పట్టరాని కోపం వచ్చేసింది. వెంటనే ఆమె ఓంపురీని సీమాకపూర్ ను ఇద్దరినీ బండ బూతులు తిట్టేసింది.
దాంతో సీమాకపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నందితపై ఫిర్యాదు చేసింది. అయితే నందిత కూడా తక్కువ తిన్లేదు. ఆమె కూడా సీమాకపూర్ పై కంప్లైంట్ ఇచ్చింది. అసలే వైవాహిక జీవితం గందరగోళంగా ఉందని ఆందోళన చెందుతున్న ఓంపురికీ.. వీళ్లిద్దరి కేసులతో ఏం చేయాలో అర్దం కాని స్దితిలో పడ్డాడు. ఆయన తన రిప్యుటేషన్ పోయి తనకు సినిమాలు రావని భయపడుతున్నాడు.


Click it and Unblock the Notifications











