పనిపిల్లలతో పద్మశ్రీ నటుడు లైంగిక సంభంధం
14 వ సంవత్సరంలోనే శాంతి అనే పనిపిల్లతో లైంగిక సంభంధం పెట్టుకున్నాడని,అలాగే లక్ష్మీ అనే పనిపిల్లతో ఆయన కొంతకాలం శృంగార కార్యక్రమాలు సాగించాడంటూ పద్మశ్రీ అవార్డు నటుడు ఓంపురిపై ఆయన భార్య రాసలీలల గుట్టు విప్పింది. 'అక్రోష్', 'అర్ధ్ సత్య', 'ఎ వెన్స్ డే' వంటి సినిమాలలో తన అసమాన నటనను పోషించి ఎందరో అభిమానులను సంపాదించుకున్న ఆయనపై ఈ విధమైన వ్యాఖ్యానాలు వినపడటంతో అందరూ ఆశ్చర్యపడుతున్నారు. అయితే ఈ కామెంట్స్ బయిటవారు అని ఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ ఆయన భార్య నందిత ఇలా ప్రపంచానికి తన భర్త అక్రమ సంభందాల చిట్టా విప్పటంతో ఆయన ఇరుకున పడ్డారు.
జర్నలిస్టు అయిన నందిత ఇటీవల 'అన్ లైక్లీ హీరో' అంటూ ఓంపురి జీవిత చరిత్ర రాశారు. ఇందులో ఆమె ఓంపురి 'రాసలీలలు' కూడా చెప్పుకొచ్చారు. ఓంపురి తన 14వ ఏట శాంతి అనే పనిమినిషితో లైంగిక సంబంధం పెట్టుకున్నారనీ, లక్ష్మి అనే మరో పనిపిల్లతోనూ ఆయన శృంగార కలాపాలు సాగించారనీ ఆమె ఇందులో పేర్కొన్నారు. ఓంపురి జీవితంలో ఈ రెండు సంఘటనలు యాదృచ్ఛికంగా సంభవించినవే కావచ్చని అన్నారు. భర్త బలహీనతలను ఇలా పబ్లిక్ గా...అది కూడా 'బయోగ్రఫీ'లో చెప్పటం ఏమిటంటూ 64 ఏళ్ల ఓంపురి ఇప్పుడు ఆమెపై మండిపతున్నాడు. ఏదైమైనా నిజం కొంత కాలం దాగుతుంది కానీ ఎల్లకాలం దాచటం సాధ్యం కాదు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











