‘ఓం శాంతి' రేపే విడుదల
ప్రతిష్ఠాత్మక వైజయంతీ హౌస్ నుండి త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ బ్యానర్ పై సి.ధర్మరాజు సమర్పణలో శేషు ప్రియాంక చలసాని ఈ చిత్రాన్ని నిర్మించిన చిత్రం 'ఓం శాంతి". ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ఈ చిత్రాన్నివిడుదల చేస్తున్నట్టు శేషు ప్రియాంక ప్రకటించారు. ఈ చిత్రంలో నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందు మాధవి, అదితిశర్మ ప్రధాన పాత్రల్లో నటించిన 'ఓం శాంతి' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 'క్లీన్'యు సర్టిఫికెట్ పొందింది.
'బాణం' చిత్రంలో అభిరుచిగల నిర్మాతగా పేరుతెచ్చుకున్న శేషు ప్రియాంకకు ఇది రెండవ చిత్రం. తమ తొలిచిత్రం తరహాలోనే వైవిధ్యమైన కథా కథనాలతో ఈ చిత్రం ఉంటుందని ఆమె చెబుతున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీత సారద్యం వహించిన ఈ చిత్రం పాటలు ఇటీవల విడుదలై శ్రోతలను అమితంగా అలరిస్తున్నాయని, సినిమా కూడా అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ప్రియాంక తెలిపారు. ఇతర పాత్రల్లో మురళీ మోహన్, రవి కాలే, రోహిత్ పాఠక్, రఘబాబు, సునీల్, సుమన్ శెట్టి, ప్రగతి, శివారెడ్డి, సారిక రామచంద్రరావు నటించారు.


Click it and Unblock the Notifications











