మిత్ర వింద ‘ఓం శాంతి' పొంగల్ స్పెషల్
నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, ఆదితి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓం శాంతి'. వైజయంతీ హౌస్ నుండి త్రీ ఎంజెల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందుతోంది. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని చలసాని శేషు ప్రియాంక నిర్మిస్తున్నారు. ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవు తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో డిసెంబర్ 5న విడుదల కానుంది. జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. వైజయంతీ మూవీస్, ఇళయరాజా కాంబినేషన్‌కు తెలుగులో మంచి క్రేజ్ ఉంది. గతంలో 'ఆఖరిపోరాటం', 'జగదేక వీరుడు- అతిలోక సుందరి', 'అశ్వమేథం' వంటి మ్యూజికల్ హిట్స్ ఈ కాంబినేషన్‌లో వచ్చాయి. ఆ కోవలోనే 'ఓం శాంతి' కూడా మ్యూజికల్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఇళయరాజా మంచి ట్యూన్స్ అందించారు. అంతేగాక అశ్వనీదత్ సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాలు హిట్టవుతాయనే సెంటిమెంట్ కూడా ఉంది. అగ్నిపర్వతం, పెళ్లి సందడి చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదలై విజయాన్ని పొందాయి. 5 కథలు, 5 జీవితాలు, ఒక నిజం అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈ చిత్రం ఓ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తుందని నిర్మాత శేషు ప్రియాంక తెలిపారు.


Click it and Unblock the Notifications











