నమ్మలేని నిజం : మెగా ఫ్యామిలీనుంచి వరస పెట్టి 16 సినిమాలు,డిటేల్స్

By Srikanya

హైదరాబాద్ : మెగా ఫ్యామిలీనుంచి అర డజను దాకా హీరోలు ఉన్నప్పుడు ఓ అర డజను దాకా త్వరలో సినిమాలు వస్తాయనుకుంటాం. అయితే అందరినీ షాక్ చేస్తూ రెట్టింపు కాదు..అంతకు మించి అంటే 15 దాకా సినిమాలు వరస పెడుతున్నాయి. అన్ని రకరకాల స్టేజ్ లలో ఉన్నాయి. నిజంగా అన్ని సినిమాలు మెగా క్యాంప్ నుంచి వస్తున్నాయా అనే డౌట్ ఉందా.అయితే మీరు పూర్తిగా చదవాల్సిందే.

ఇవన్నీ చూస్తూంటే ఒక నిజం చెప్పాలపిస్తుంది. 15 సినిమాలు అంటే దాదాపు టాలీవుడ్ లో ఎక్కువ డబ్బు రొటేట్ అవుతోంది మెగా క్యాంప్ వల్లే అన్నమాట. కొంచెం క్రేజీగా అనిపించవచ్చు కానీ నిజం అండీ నిజం. వీటికి తోడు మెగా క్యాంప్ నుంచి ఒక హీరోయిన్ సినిమా కూడా నీహారిక కొణిదెల కూడా తన తొలి చిత్రం ఒక మనస్సు రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది.

మెగా క్యాంప్ మూల పురుషుడు, మెగా స్టార్ చిరంజీవి 150 వ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన వరుణ్ తేజ దాకా వరస పెట్టి కథలు వినటం, దర్శక,నిర్మాతలతో చర్చలు, ఎగ్రిమెంట్స్ చేస్తున్నారు. ఎంత బిజీగా గడిపినా 15 సినిమాలు సినిమాలు ఎక్కడ నుంచి వస్తాయి అంటారా అయితే పూర్తి డిటేల్స్ స్లైడ్ షోలో చదవండి..ఒప్పుకోకుండా ఉండలేరు.

చిరంజీవి

చిరంజీవి

మొదటగా మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంతో మెదలెడదాం. వివివినాయిక్ దర్శకత్వంలో రూపొందబోతున్న చిత్రం ఇది. మంచి అంచనాలే ఉన్నాయి.

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

మెగా క్యాంప్ లో ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. ఫ్యాక్షనిస్ట్ ప్రేమ కధగా ఈ చిత్రం రెడీ అవుతోంది.

త్రివిక్రమ్ తోనూ

త్రివిక్రమ్ తోనూ

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రంకి సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. కోబలి స్క్రిప్టుతో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాసం ఉంది.

ధృవ

ధృవ

రామ్ చరణ్ , సురేంద్రరెడ్డి కాంబినేషన్ లో తని ఒరువన్ రీమేక్ గా ధృవ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది.

సుకుమార్ తో

సుకుమార్ తో

సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సైన్స్ ఫిక్షన్ చిత్రం ఒకటి ఓకే అయ్యింది. ఈ చిత్రంలో డాక్టర్ గా రామ్ చరణ్ కనిపించనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రొడక్షన్ వర్క్ మొదలైంది.

వరుణ్ తేజ

వరుణ్ తేజ

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ తన తదుపరి చిత్రాన్ని శ్రీను వైట్ల దర్శకత్వంలో మిస్టర్ టైటిల్ తో చేయబోతున్నారు. ఈ మేరకు గ్రాండ్ గా ఓపినింగ్ జరిగింది.నల్లమలుపు బుజ్జి ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.

శేఖర్ కమ్ముల

శేఖర్ కమ్ముల

మకో ప్రక్క శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా ఓ చిత్రం మొదలు కానుంది. ఈ మేరకు కాస్టింగ్ కాల్ ని సైతం రీసెంట్ గా ఇచ్చారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

రాయబారి

రాయబారి

క్రిష్, వరుణ్ తేజ కాంబినేషన్ లో అప్పట్లో రాయబారి అనే చిత్రం మొదలౌతుందని అనుకున్నారు. కానీ మొదలు కాకుండానే ఆగిపోయింది. అయితే రీసెంట్ గా వరుణ్ తేజ...త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమవుతుందని చెప్పారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్, లింగు సామి కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. తమిళ,తెలుగు భాషల్లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

హరీష్ శంకర్

హరీష్ శంకర్

ఇప్పటికే హరీష్ శంకర్...అల్లు అర్జున్ కు ఓ స్టోరీ లైన్ చెప్పి ఒప్పించినట్లు చెప్తున్నారు. దాంతో లింగుసామి ప్రాజెక్టు తర్వాత ఈ చిత్రం ఉండబోతోంది.

తిక్క

తిక్క

సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా తిక్క అనే టైటిల్ తో ఓ చిత్రం రెడీ అవుతోంది. షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

గోపీచంద్ మలినేని

గోపీచంద్ మలినేని

వరస హిట్స్ ఇస్తూ వస్తున్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆయన దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా ఓ చిత్రం లాంచ్ అయ్యింది. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది.

జవాన్

జవాన్

దర్శక,రచయిత బి.వియస్ రవి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ హీరోగా జవాన్ టైటిల్ తో ఓ చిత్రం ప్రారంభం కానుంది.

అల్లు శిరీష్

అల్లు శిరీష్

పరుశరామ్ దర్శకత్వంలో శ్రీరస్తు..శుభమస్తు టైటిల్ తో ఓ చిత్రాన్ని అల్లు శిరిష్ చేస్తున్నారు.

ఇంకోటి

ఇంకోటి

అల్లు శిరీష్ హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రకటన ఇప్పటికే వచ్చింది. పూజ కూడా జరిగింది.

ఒక మనస్సు

ఒక మనస్సు

నాగబాబు కుమార్తె నీహారిక కొణిదెల హీరోయిన్ గా పరిచయమవుతూ చేస్తున్న చిత్రం ఒక మనసు, ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X