»   » రియల్ సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ కాదు!

రియల్ సన్నాఫ్ సత్యమూర్తి అల్లు అర్జున్ కాదు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘సన్నాప్ సత్యమూర్తి' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసందే. సినిమాలో మాత్రమే అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి. కానీ రియల్ లైఫ్ లో సన్నాఫ్ సత్యమూర్తి మాత్రం ఆ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి పేరు సత్యమూర్తి అనే సంగతి తెలిసిందే. ఆయన కూడా సినీ కళాకారుడే.

ఆ సంగతి పక్కన పెడితే...అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వస్తున్న ఆరో సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి'. ‘ఆర్య'తో వీరి కాంబినేషన్ మొదలైంది. వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు వచ్చిన 5 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ‘సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విల్లూరుతున్నాడు దేవిశ్రీ.


OMG! Allu Arjun Is Not The Real Son Of Satyamurthy

కాగా...అల్లు అర్జున్ నటించిన ‘రేసు గుర్రం' 2014లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలించింది. ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 58 కోట్ల షేర్ సాధించి మంచి లాభాలను మిగిల్చింది. ఈ సంవత్సరం కూడా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల మ్యాజిక్ క్రియేట్ చేయాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాలకు కలిపి మొత్తం రూ. 55 కోట్లకు అమ్మినట్లు సమాచారం. ఈ రైట్స్ అమ్మడం ద్వారా నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయని అంటున్నారు. సినిమాను కొన్న బయ్యర్లు కూడా లాభాల బాట పట్టాలంటే చిత్రం 60 కోట్లు వసూలు చేయాల్సిందే.


కాగా ఈ చిత్రం ఆడియో వేడుక మార్చి 14న శిల్ప కళా వేదికలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 2న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం,రావ్ రమేష్ నటిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

English summary
It is known that Allu Arjun is playing the lead role in Trivikram's Son Of Satyamurthy. But the real Son Of Satyamurthy is somebody else. Before you stress out your brains, we are taking about the off-screen Son Of Satyamurthy. The title is an apt one for music director Devi Sri Prasad, since his father name is Satyamurthy.
Please Wait while comments are loading...