»   » కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం ఇదే? (బాహుబలి 2 స్టోరీ లీక్)

కట్టప్ప బాహుబలిని చంపడానికి కారణం ఇదే? (బాహుబలి 2 స్టోరీ లీక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బాహుబలి 2' సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి భాగంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో త్వరలో విడుద కాబోతున్న పార్ట్ 2 చూసి తెలుసుకోవాలని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా బాహుబలి 2 సినిమాకు సంబంధించిన స్టోరీ ఇంటర్నెట్లో లీకైంది. కట్టప్ప బాహుబలిని చంపడానికి గల కారణం కూడా ఇందులో ఉంది. అయితే ఇది నిజమైన స్టోరీనా? లేక ఫేక్ స్టోరీనా? అనేది తెలియాల్సి ఉంది.


సోషల్ మీడియాలో ప్రచారం మేరకు లీకైన స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.


గిరిజన రాజు కూతురు ప్రేమలో బాహుబలి

గిరిజన రాజు కూతురు ప్రేమలో బాహుబలి

ఒక సందర్భంలో ఎదురైన గిరిజన రాజు కుమార్తె దేవసేనతో బాహుబలి ప్రేమలో పడతాడు. రాజ్యకాంక్ష బలంగా ఉన్న భల్లాలదేవ సోదరుడిని అడ్డుతొలగించుకునేందుకు కుయుక్తితో అతని ప్రేమను ప్రోత్సహిస్తాడు.


దేవసేన నిరాకరణ

దేవసేన నిరాకరణ

అయితే మాహిష్మతి సామ్రాజ్యంలోకి వచ్చేందుకు దేవసేన నిరాకరిస్తుంది. దీంతో రాజ్యకాంక్ష లేని బాహుబలి రాజ్యాన్ని వదిలి అడవిబాట పడతాడు. ఓ వైపు బాహుబలిని ప్రోత్సహిస్తున్న భల్లాలదేవ, వారి ప్రేమ గురించి తల్లికి లేనిపోనివి కల్పించి చెబుతుంటాడు. దీంతో రాజ్యాధికారం నెమ్మదిగా హస్తగతం చేసుకుంటాడు.


మాహిష్మతి రాజ్యంలో అరాచకాలు

మాహిష్మతి రాజ్యంలో అరాచకాలు

అధికారం చేతికి వచ్చాక బాహుబలిని అంతమొందించడమే భల్లాలదేవ లక్ష్యమైపోతుంది. తను నమ్మిన బంటులతో మాహిష్మతి రాజ్యంలో అరాచకాలు చేయిస్తుంటాడు. అవన్నీ బాహుబలి అండతో ఆటవికసైన్యం చేస్తోందని ప్రచారం చేయిస్తాడు. దీనిని రాజమాత శివగామి నమ్మేలా చేస్తాడు.


శివగామి ఆదేశాలు బాహుబలికి చేరకుండా

శివగామి ఆదేశాలు బాహుబలికి చేరకుండా

ఈ పరిణామాలతో బాహుబలిని తక్షణం తనవద్దకు రావాలని ఆర్డర్ వేస్తుంది. అయితే బాహుబలికి ఆ వార్త చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఈ క్రమంలో మాహిష్మతి సైన్యం భల్లాలదేవ ఆదేశాలతో ఆటవికులపై దాడులు చేస్తుంది. అంతే కాకుండా గిరిజన స్త్రీలను చెరబడుతుంది. వీటిని శివగామికి తెలియకుండా భల్లాలదేవ జాగ్రత్తలు తీసుకుంటూ బందిపోటు దాడులు అధికమయ్యాయని, మాహిష్మతి ప్రజలు ప్రశాంతంగా బతకలేకపోతున్నారని శివగామికి నూరిపోస్తుంటాడు.


బాహుబలిపై దండయాత్ర

బాహుబలిపై దండయాత్ర

దీంతో అంతర్గత కలహాలు ప్రారంభమయ్యాయని భావించిన శివగామి బాహుబలిని బంధించి తేవాలని ఆదేశిస్తుంది. భల్లాలదేవుడు కోరుకున్న ఆదేశాలు రావడంతో బాహుబలిపై దండయాత్రకు బయల్దేరుతాడు. ఈ విషయం వేగుల ద్వారా తెలుసుకున్న బాహుబలి, తన భార్య దేవసేనతో కలిసి భల్లాలదేవతో పోరాటానికి బయల్దేరుతాడు.


కట్టప్పను రాజమాత యుద్ధభూమికి పంపుతుంది

కట్టప్పను రాజమాత యుద్ధభూమికి పంపుతుంది

ఈ సమయంలో చోటుచేసుకున్న సంభాషణతో భల్లాలదేవుడి వెంట వచ్చిన సైన్యంలో కొంత చీలిక వస్తుంది. దీంతో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇద్దరూ హోరాహోరీగా పోరాడుతున్న సమయంలో కోటకు కాపలాగా ఉన్న కట్టప్పను రాజమాత యుద్ధభూమికి పంపుతుంది. బాహుబలిని బంధించి లేదా అంతమొందించి రమ్మని ఆదేశిస్తుంది.


అందుకే కట్టప్ప బాహుబలిని చంపుతాడా?

అందుకే కట్టప్ప బాహుబలిని చంపుతాడా?

కట్టప్ప యుద్ధ భూమికి వెళ్లే సమయానికి భల్లాదేవ ఓటమి అంచున ఉంటాడు. దీంతో బాహుబలిని కట్టప్ప వెనక నుంచి బల్లెంతో పొడిచి చంపుతాడు. ఈ క్రమంలో దేవసేన జరిగినదంతా రాజమాత శివగామికి చెబుతుంది. దీంతో బాహుబలిని పొట్టనబెట్టుకున్నందుకు క్షోభపడుతుంది. ఈ క్రమంలో కోడలు గర్భవతి అని తెలిసి కోటలోనే ఉండమంటుంది.


తర్వాత జరిగిన స్టోరీ

తర్వాత జరిగిన స్టోరీ

దేవసేన ప్రసవ సమయంలో అక్కడి వారి కుట్రలు పసిగట్టిన శివగామి బాహుబలి కొడుకుని తీసుకుని పారిపోతుంది.... ఆ తర్వాత ఆ బాలుడు కొండప్రాంతం వారి వద్దకు చేరడం, శివుడుగా పెరగడం తెలిసిందే.


నమ్మేలా లేదు ఈ స్టోరీ

నమ్మేలా లేదు ఈ స్టోరీ

తొలి భాగం సినిమా పరిశీలిస్తే... భల్లాలదేవ కూడా దేవసేనపై మనసు పారేసుకున్నట్లు స్పష్టం అవుతుంది. కానీ ఈ లీకైన స్టోరీలో అలాంటి ప్రస్తావన లేదు. పైగా బల్లాలదేవ.... బాహుబలి-దేవసేన ప్రేమను ప్రోత్సహిస్తాడు అని ఉంది.


English summary
Baahubali 2 Full Story leaked: This is terrible that has happened and Rajamouli might curse himself for having done the movie in two parts. Reports say that Bahubali 2 full story leaked and it reveals on 'Why was Bahubali killed?", Why Sivagami saved Shivudu? and How was Bahubali killed? so on.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu