»   » షాకింగ్: సన్నీ లియోన్‌తో తెలుగు హీరో రానా రొమాన్స్!

షాకింగ్: సన్నీ లియోన్‌తో తెలుగు హీరో రానా రొమాన్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మీరు విన్నదినిజమే! టాలీవుడ్ హీరో రానా....బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్‌తో రొమాన్స్ చేయబోతున్నాడు. ఆరడుగుల అందగాడైన ఈ టాలీవుడ్ యంగ్ స్టార్...త్వరలో విడుదల కాబోతున్న రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో యుద్ధవీరుడిగా కనిపించబోతున్నాడు.

సినిమాలకు సంబంధించిన తనకు ఒకే రకమైన ఇమేజ్ ఉండటం ఇష్టం లేని రానా....సంథింగ్ స్పైగా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాడట. రానా త్వరలో టార్జాన్ తరహా పాత్రలో, సన్నీ లియోన్ జేన్ పాత్రలో కనిపించబోతున్నారు. అయితే వీరు కలిసి నటించేది తెలుగు సినిమాలో మాత్రం కాదు. ఓ హిందీ చిత్రంలో ఇద్దరూ కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. అయితే తెలుగులోనూ ఈ చిత్రం అనువాదం కాబోతుందని సమాచారం.

OMG! Rana Daggubati To Romance Sunny Leone

ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో పూర్తి స్థాయిలో తెలియబోతున్నాయి. రానా ఇప్పటికే తెలుగుతో పాటు తమిళం, హిందీ ఇతర చిత్రాల్లో నటించి ఆయా పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాను ఒకే పరిశ్రమకే పరిమితం కాకుండా అన్ని బాషల సినీ పరిశ్రమల్లోనూ రాణించాలనే లక్ష్యంతో సాగుతున్నాడు.

ప్రస్తుతం రానా ‘బెంగులూరు డేస్' చిత్రంలో నటిస్తున్నాడు. మరో వైపు రానా నటించని రుద్రమదేవి, బాహుబలి చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాల విడుదల తర్వాత రానా కెరీర్ పూర్తిగా మారిపోనుందని అంటున్నారు.

English summary
Yes! What you read with your eyes popped out is absolutely true. Rana Daggubati is going to romance the sexy siren Sunny Leone. Rana, the macho man of Tollywood, is popularly known as the epic man of late, considering his next few releases. But it looks like Rana has decided to get off the tag and pick up something spicy as well.
Please Wait while comments are loading...