హాట్ టాపిక్ : ఓంకార్ పై మహేష్‌ బాబు సెటైర్స్?

By Srikanya

Omkar in Mahesh Babu’s Aagadu Movie
హైదరాబాద్ : జీ తెలుగులో 'ఆట' ప్రోగ్రామ్‌ ద్వారా పాపులర్‌ అయిన యాంకర్‌ ఓంకార్‌. ఆయనపై మహేష్ బాబు వ్యంగాస్త్రాలు సంధించనున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారం. మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' లో ఓంకార్ అన్నయ్యపై ఓ రేంజిలో సెటైర్స్ ఉంటాయని చెప్తున్నారు. సినిమాలో ఓంకార్ ని పేరడీ చేస్తూ సీన్స్ ఉన్నాయని,మహేష్ ఆ సీన్స్ బాగా పండిస్తున్నాడని,పూర్తి కామెడీగా ఆ సీన్స్ సాగుతాయని చెప్తున్నారు. దూకుడులో రియాల్టి షో లపై సెటైర్స్ వేసిన శ్రీను వైట్ల ఈ సారి ఈ నేపధ్యాన్ని తీసుకుని కథ లో కామెడీ సీక్వెన్స్ అల్లుకున్నాడని చెప్తున్నారు.

మహేష్ బాబు చిత్రం రిలీజ్ కోసం అభిమానులే కాకుండా సామాన్య సినీ జనం సైతం ఆసక్తిగా చూస్తారు. 'దూకుడు'తో మహేష్‌బాబుని పరర్ ఫుల్ పోలీసుగా చూపించిన శ్రీనువైట్ల ఇప్పుడు మరోసారి మహేష్‌తో ఖాకీ కట్టించారు. వీరిద్దరి కలయికలో 'ఆగడు' రూపుదిద్దుకుంటోంది. దాంతో ఈ చిత్రంపై ఓ రేంజిలో క్రేజ్ క్రియేట్ అవుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 26న సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

గతంలో పోకిరి,దూకుడు చిత్రాలలో పోలీస్ గా కనిపించిన మహేష్ బాబు మరోసారి పోలీస్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ఆగడు లో మహేష్ మరోసారి పోలీస్ గా తన విశ్వరూపం చూపించనున్నాడని సమాచారం. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఈ సారి మరింత యాక్షన్ ని పెంచినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకోవటంతో ఈ సారి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని శ్రీను వైట్ల ఫిక్సైనట్లు చెప్తున్నారు. అందుకు తగినట్లే మహేష్ క్యారెక్టర్ ని టఫ్ పోలీస్ గా రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు.

ఇంతకాలం శ్రీను వైట్లతో కలిసి పని చేసిన గోపీ మోహన్, కోన వెంకట్ సొంతగా దర్శకత్వం వైపు అడుగులు వేయడంతో.... 'ఆగడు' సినిమాకు సొంతగా స్క్రిప్టు రాసుకుని దిగారు శ్రీను వైట్ల. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు చేసారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు' సినిమా చేయడానికి రెడీ కావడం గమనార్హం. ఖచ్చితంగా మరో హిట్ తో వస్తామని శ్రీను వైట్ల పూర్తి నమ్మకంగా ఉన్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: కె.వి. గుహన్‌, కళ: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కూర్పు: ఎం.ఆర్‌.వర్మ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X