తమన్నా తప్పుకోవడం మా అదృష్టం.. అందుకే వెంకీని కాదని.. నాగార్జున తెరపైకి

రాజుగారి గది సినిమాతో హారర్ సినిమాల్లో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అప్పటి వరకు హారర్ సినిమాలంటే.. కేవలం భయపెట్టడమే అనుకున్న మేకర్స్.. కామెడీని జోడిస్తూ చిత్రీకరిస్తూ వస్తున్నారు. ఇదే ఫ్రాంచైజీలో రాజు గారి గది 2 చిత్రం వచ్చింది. అందులో ఎంటర్టైన్మెంట్ పార్ట్ కాస్త తగ్గడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. రాజు గారి గది 3 చిత్రం రేపు(అక్టోబర్ 18) విడుదల కానున్న సందర్భంగా చిత్ర దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

తమన్నా బదులు కాజల్, తాప్సీలను ప్రయత్నించాము..

తమన్నా బదులు కాజల్, తాప్సీలను ప్రయత్నించాము..

మొదటగా ఈ సినిమాలో తమన్నాను తీసుకున్నాము.. కానీ డేట్స్‌లో సమస్యలు రావడంతో ఆమె తప్పుకుంది.. అయితే మళ్లీ అదే రేంజ్ హీరోయిన్లకు కథ వినిపించాను. కాజల్, తాప్సీ లాంటి వాళ్లను కలిశాను. కాజల్‌కు కథ బాగా నచ్చింది.. చేసేందుకు ఒప్పుకుంది. కానీ అక్కడ కూడా డేట్స్ సమస్యే వచ్చింది. తాప్సీ కూడా అంతే.. ఏడాది పొడవునా బిజీగానే ఉంది.

అందుకే అవికాను తీసుకున్నాము..

అందుకే అవికాను తీసుకున్నాము..

అవికా గోర్‌ను చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అప్పటి నుంచి చూస్తున్నాము.. ఆమె చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఆమె ఇంతవరకు హోమ్లీ క్యారెక్టర్ చేసిన అవికా.. హారర్ మూవీ, దెయ్యం పాత్రను పోషిస్తే బాగుంటుందని తనను అప్రోచ్ అయ్యాము.. అంతేకాకుండా మంచి సక్సెస్‌లో ఉన్నప్పుడు ఇక్కడి నుంచి వెళ్లిపోయింది.. దాదాపు మూడేళ్లు అవుతుంది తెలుగులో సినిమా చేయకుండా.. అందుకే కమ్ బ్యాక్‌గా ఆమెకు ఈ సినిమా బాగుంటుందని తీసుకున్నాము.

తమన్నా తప్పుకోవడం.. అశ్విన్ అదృష్టం

తమన్నా తప్పుకోవడం.. అశ్విన్ అదృష్టం

ఈ సినిమా నుంచి తమన్నా తప్పుకోవడం.. అశ్విన్‌కు కలిసి వచ్చింది. మొదటగా ఈ కథను తమన్నా చుట్టూ అల్లుకుని రాశాను.. అయితే ఆమె తప్పుకోవడంతో ఆ పాత్రను పక్కన పెట్టేశాను. దీంతో కథను అశ్విన్‌ను మెయిన్ పార్ట్‌గా తీసుకుని చేంజ్ చేశాను.. దీంతో అశ్విన్ హైలెట్ అవుతాడు. అందుకే తమన్నా తప్పుకోవడం అశ్విన్ అదృష్టమని అనిపిస్తుంది.

 వెంకటేష్‌కు బదులు.. నాగార్జున

వెంకటేష్‌కు బదులు.. నాగార్జున

రాజుగారి గది 2 సినిమాలో వెంకటేష్ చేయాల్సిన పాత్రను నాగార్జున చేశాడు. మొదటగా వెంకటేష్‌కు కథ చెప్పానని, నచ్చడంతో ఒకే అన్నాడు కానీ, డేట్స్ కుదరకపోవడంతో నాగార్జున చేశాడు. అయితే రాజుగారి గది ఫ్రాంచైజీలో వెంకటేష్‌తో సినిమా మాత్రం కచ్చితంగా ఉంటుంది. అది నాల్గో పార్టా? ఐదో పార్టా? అని చెప్పలేను. అలాగే తమన్నా కోసం రాసుకున్న పాత్ర కూడా అలాగే ఉంది.. రాబోయే సినిమాల్లో ఎక్కడైనా వాడుతాను.

స్పోర్ట్స్ డ్రామాతో...

స్పోర్ట్స్ డ్రామాతో...

తదుపరి ప్రాజెక్ట్స్‌లో భాగంగా నా వద్ద ప్రస్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన కథ, రాజు గారి గది 4 కథ సిద్దంగా ఉన్నాయి. వీటిలో ఏది మొదటగా చేస్తానో తెలియదు. మళ్లీ నాకు బుల్లితెరపై రానున్న సిక్స్త్ సెన్స్ మూడో సీజన్ రెడీగా ఉంది. ఆ పనులన్నీ పూర్తయ్యాక ఏ సినిమాను చేయనున్నానో ప్రకటిస్తాను

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X