60 ఏళ్ల జీవితం అతనితో పంచుకోవడం..!
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయిన కవి-రచయిత అయినటువంటి తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ గదిని బుధవారం సందర్శించి ఆయన మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. స్వతహాగా హిందీ కవి అయిన హరివంశరాయ్ బచ్చన్‌కు అమితాబ్ ఘన నివాళులర్పించారు. తన తండ్రి హరివంశరాయ్‌తో 60 ఏళ్ల జీవితాన్ని పంచుకోవడం గొప్ప విషయమని బిగ్ బీ ట్విట్టర్ పేర్కోన్నారు.
జనవరి 18 తేది, 2003 సంవత్సరంలో తన నివాసం 'ప్రతీక్ష'లో తుదిశ్వాస విడిచారని... ఆయన కనుమూసిన ప్రదేశాన్ని చూస్తూ మౌనంగా నిలుచున్నానని ఆయన తెలిపారు. తన తండ్రి "మధుశాల" మరియు "అగ్నీపత్" లాంటి సాహిత్య రచనలుతో దేశాన్ని అలరించారని తన ట్విట్టర్ ఎకౌంట్‌లో పేర్కోన్నాడు. ఆయన రచనలు తనకు స్పూర్తి అని.. ఆయనతో సుధీర్ఘకాలం జీవితాన్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. మా తండ్రిగారి మరణం నాకు ఓ మంచి స్నేహితుడుని కొల్పోయాడనే భావన కలుగుతుందని అన్నారు.


Click it and Unblock the Notifications











