రామ్ చరణ్,శ్రీను వైట్ల చిత్రం (ఆన్ లొకేషన్ ఫొటోలు)
హైదరాబాద్ : రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రానికి సంభందించి ఆన్ లొకేషన్ స్టిల్స్ ఇవి. ఈ స్టిల్స్ లో మీకు రామ్ చరణ్ కనపడరు.
ఇవి....రామ్ చరణ్ ...ఛైల్డ్ హుడ్ ఎపిసోడ్ కు చెందిన ఫొటోలు. ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయని తెలుస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఈ ప్లాష్ బ్యాక్ చాలా కీలకమై నిలుస్తుందని అందుకే వీటితోనే షూటింగ్ మొదలు పెట్టారు. ఈ ఫొటోల్లో తణికెళ్ల భరణి, జూ చరణ్ గా చేస్తున్న చైల్డ్ ఆర్టిస్టు మధ్య సీన్స్ చిత్రీకరించటం చూడవచ్చు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక ఈ చిత్రాన్ని ఈ దసరాకు విడుదల చేయాలని టార్గెట్ చేస్తున్నారు. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. కోన వెంకట్, గోపీ మోహన్ కలిసి స్క్రిప్టు అందిస్తూండగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
దర్శకుడు మాట్లాడుతూ ''యాక్షన్‌తో కూడిన కుటుంబ కథా చిత్రమిది. భారీ తారాగణంతో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమా తెరకెక్కిస్తాం'' అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రం అందరినీ అలరించేలా ఉంటుంది. శ్రీనువైట్ల మూల కథ అందించారు. శ్రీను వైట్ల, రచయితలు కోన వెంకట్, గోపీమోహన్‌ది విజయవంతమైన కాంబినేషన్ అనీ, ఆ కాంబినేషన్‌తో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందని నిర్మాత దానయ్య అన్నారు.
ఈ చిత్రానికి కథ: కోన వెంకట్, గోపీమోహన్, మాటలు: కోన వెంకట్, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, కూర్పు: ఎ.ఆర్. వర్మ, కళ: నారాయణరెడ్డి, ఫైట్స్: అణల్ అరసు, సమర్పణ: డి. పార్వతి, మూలకథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











