మహేష్ హ్యాండ్ ఇస్తే 'సుక్కు’తో అల్లు అర్జున్ కి ఛాన్స్...!
'బన్నీ" అనేది అల్లు అర్జున్ ముద్దుపేరు అయినట్టు గానే..'సుక్కు"అన్నది డైరెక్టర్ సుకుమార్ ముద్దుపేరు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడో సినిమా రానుందని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న '100% లవ్" వచ్చే నెల 29న విడుదల కానుంది. ఈ చిత్రం అనంతరం సుకుమార్ దర్శకత్వంలో వహించే సినిమా ఇప్పటివరకు ఖరారు కాలేదు.
ఆ మధ్య మహేష్ బాబుతో సుకుమార్ సినిమా అని వార్తలు వచ్చినప్పటికీ..మహేష్ బాబు కమిటై ఉన్న సినిమాల లిస్ట్ ను బట్టి..సుకుమార్ సినిమా ఇప్పట్లో ఉండే అవకాశం లేదు. అలాగే మేలో విడుదల కానున్న'బద్రినాథ్" అనంతరం అల్లు అర్జున్ నటించే సినిమా ఏమిటనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమా అని ఆమధ్య ప్రచారం జరిగినప్పటికీ..ఆ సినిమా ఇప్పడు ప్రశ్నార్థకమయ్యేట్టుంది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్, సుకుమార్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











