Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ దర్శకుడి కోసం బి.గోపాల్ సినిమాను మరోసారి వాయిదా వేసిన బాలయ్య..?
ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించడానికి చాలానే ఇబ్బందులు పడుతున్నాడు.బాలకృష్ణకు నరసింహా నాయుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కూడా సినిమా సెట్టవ్వడం లేదు. రచయిత సాయి మాధవ్ బుర్ర సహకారంతో కథ సెట్ చేసుకున్నప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.
త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఊహించని విధంగా కరోనా దెబ్బ పడింది. ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సినిమాను మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్నాథ్ చెప్పిన కొత్త కథ నచ్చడంతో ఆ సినిమాను తొందరగా ఫినిష్ చేసి బి.గోపాల్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.

ఎందుకంటే పూరి జగన్నాథ్ షూటింగ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. వీలైనంత వేగంగా సినిమాను ఫినిష్ చేయడానికి సిద్ధపడతారు. ఇక బి.గోపాల్ సినిమా బిగ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిదానంగా పూర్తి చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బి.గోపాల్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఊహించని విధంగా వాయిదా వేయడంతో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.