twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మా'లో ముదిరిన వివాదం.. కోర్టుకైనా వెళతా, కుర్చీ మాత్రం దిగనంటున్న శివాజీ రాజా!

    |

    రాజకీయ ఎన్నికల స్థాయిలో మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష పదవికి పోటీ పడిన శివాజీ రాజా, నరేష్ మా మధ్య విభేదాలు లేవంటూనే తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మార్చి 10న మా అసోసియేషన్ ఎన్నిక ముగిసింది. నరేష్ ప్యానల్ విజయం సాధించింది. నరేష్ ప్యానల్ లో పోటీ చేసిన జీవిత, రాజశేఖర్ కూడా విజయం సాధించారు. త్వరలో నరేష్ మా అసోసియేషన్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించబోతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా శివాజీ రాజా, నరేష్ మధ్య వివాదాలు ఆగడం లేదు.

     తీవ్రంగా విమర్శించుకుంటూ

    తీవ్రంగా విమర్శించుకుంటూ

    మా ఎన్నికల ప్రచారం సమయంలో శివాజీ రాజా, నరేష్ ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. తమ మధ్య విభేదాలు లేవంటూనే పరస్పరం నిందలు వేసుకున్నారు. దీనితో రసవత్తరంగా సాగిన ఎన్నికలో నరేష్ 69 ఓట్ల తేడాతో శివాజీ రాజాపై విజయం సాధించారు. శివాజీ రాజా ప్యానల్ లో రాజశేఖర్, జీవిత దంపతులు బరిలో నిలిచారు. ఎన్నికలో విజయం సాధించిన తర్వాత నరేష్ మాట్లాడుతూ తాను ఈ ఒక్క టర్మ్ మాత్రమే అధ్యక్షుడిగా ఉంటానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

    కుర్చీ దిగనంటున్న శివాజీ రాజా

    కుర్చీ దిగనంటున్న శివాజీ రాజా

    మా కొత్త అధ్యక్షుడిగా శివాజీ రాజా, అతడి ప్యానల్ సభ్యులు భాద్యతలు స్వీకరించేందుకు మార్చి 22న ముహూర్తం కుదుర్చుకున్నారు. దీనికి శివాజీ రాజా మాత్రం అంగీకరించడం లేదు. తనకు మార్చి 31 వరకు అధ్యక్షుడిగా ఉండే హక్కు ఉందని, అవసరమైతే కోర్టుకైనా వెళతానని అంటున్నట్లు నరేష్ తెలిపారు. దీనితో ఎన్నికల తర్వాత కూడా ఈ విభేదాలు ఏంటని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

    కుర్చీ పిచ్చి లేదు

    కుర్చీ పిచ్చి లేదు

    నేను చట్టబద్ధంగా ఎన్నికలో విజయం సాధించా. ఎప్పుడైనా భాద్యతలు స్వీకరించే అవకాశం ఉంది. గత చెక్కులని పరిశీలించే విషయంలో తనకు ప్రస్తుతం ఉన్న సభ్యులు సహకరించడంలేదని నరేష్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో శివాజీ రాజా వ్యవహరించినవిధానం చాలా అభ్యంతరకరం అని నరేష్ అన్నారు. తాను మా అసోసియేషన్ కోసం పని చేయాలని అనుకుంటున్నానని అనవసరమైన అడ్డంకులు, వివాదాలు సృష్టించవద్దని కోరారు.

    పెద్దలని సంప్రదించి

    పెద్దలని సంప్రదించి

    శివాజీ రాజా వైఖరిపై ఇండస్ట్రీలోని పెద్దలని సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటామని నరేష్ తెలిపారు. ఇటీవల మా అసోసియేషన్ లో తరచుగా విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. గతంలో మెగాస్టార్ చిరంజీవితో యుఎస్ లో మా అసోసియేషన్ తరుపున ఈవెంట్ నిర్వహించారు. ఆ ఈవెంట్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ నరేష్ రచ్చకెక్కారు. ఇండస్ట్రీలోని కొందరు చర్చలు జరిపి ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు. మా ఎన్నికతో మరోమారు వీరి మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.

    English summary
    Once again differences between Sivaji Raja and Naresh
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X