నాని 'హౌజ్ ఫుల్ షో' అలా మొదలైంది: ఈ ఫోటో యాధృచ్చికమే!..
ఓ స్టార్ హీరో సినిమా కోసం ఒకప్పుడు థియేటర్ ముందు క్యూ లైన్లో నిలబడి.. హౌజ్ ఫుల్ అని బోర్డు పెడితే నిరాశతో వెనుదిరిగిన వ్యక్తి.. ఆ తర్వాత అదే 'హౌజ్ ఫుల్' బోర్డు చూసి సంతోషపడటం యాధృచ్చికమే.
హీరోల కెరీర్ గ్రాఫ్‌ను డిసైడ్ చేసే 'హౌజ్ ఫుల్' బోర్డులు.. నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం అష్టాచెమ్మాతో మొదలైన నాని 'హౌజ్ ఫుల్' షో.. నేడే విడుదలైన ఎంసీఏ దాకా విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది.
ఈ నేపథ్యంలో నాని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం..
అలా మొదలైంది:
2008లో అష్టా చెమ్మాతో విజయవంతంగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన నాని.. కెరీర్‌ను బ్యాలెన్సెడ్‌గా కొనసాగిస్తూ వస్తున్నారు. నేడు ఎంసీఏ విడుదల సందర్భంగా.. తన ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో అష్టా చెమ్మా విడుదల సందర్భంగా ఓ థియేటర్ వద్ద దిగిన 'హాలు నిండినది' అన్న ఫోటోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

అందనిరీ థ్యాంక్స్:
'తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజున నా కుటుంబ పరిధి విస్తరించడం మొదలైంది. అప్పటినుంచి ఇప్పటిదాకా అది పెరుగుతూనే ఉంది. నన్నూ మీలో ఒకడిగా చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు' అంటూ నాని తన పాత ట్విట్ రీట్వీట్ చేశారు.

భూమికతోను.. యాధృచ్చికమే:
ఒకప్పుడు ఖుషి సినిమా చూడటం కోసం వెళ్లి థియేటర్ వద్ద పోలీసులతో దెబ్బలు తిన్నట్లు ఇటీవల భూమికతో నాని చెప్పారు. నాని కెరీర్‌లో ఇది కూడా యాధృచ్చికమే. ఖుషి సినిమా సమయంలో.. ఏ హీరోయిన్‌ను అయితే స్క్రీన్ మీద చూడటానికి వెళ్లాడో.. అదే హీరోయిన్ తో ఎంసీఏలో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం.

తొమ్మిదేళ్ల కెరీర్:
అష్టాచెమ్మతో మొదలు భీమిలి కబడ్డీ, పిల్ల జమీందార్, అలా మొదలైంది, ఈగ, ఎవడే సుబ్రహ్మణ్యం, భలే భలే మొగాడివోయ్, జెంటిల్‌మెన్, నేను లోకల్, నిన్ను కోరి.. ఇలా నాని విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా విడుదలైన ఎంసీఏ ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











