మరోసారి ప్రభాస్ స్నేహితులపై విరుచుకుపడిన అభిమానులు.. ఈసారి దారుణంగా..
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ సినిమా కోసం ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే చిత్ర యూనిట్ మాత్రం వారి గోడును ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అప్డేట్స్ ఇచ్చినా కూడా ఆవేవి కూడా అభిమానుల అంచనాలను అందుకోవడం లేదు. ఇక మరోసారి ప్రభాస్ స్నేహితులైన యూవీ నిర్మాతలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ట్యాగ్ ను కూడా వైరల్ చేశారు.

అభిమానులను బాగా హార్ట్ చేసింది
ప్రభాస్ బాహుబలి అనంతరం కాస్త స్పీడ్ గా సినిమాలు చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. కానీ సాహో కారణంగా అది కుదరలేదు. ఎదో చిన్న బడ్జెట్ లో తెరకెక్కాల్సిన ఆ సినిమాను అనవసరంగా ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి ప్లాప్ ఎదుర్కొన్నారని కామెంట్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్లు భారీ స్థాయిలో నష్టపోవాల్సి వచ్చింది. ఆ విషయం అభిమానులను బాగా హార్ట్ చేసింది.

నెగిటివ్ కామెంట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు
సాహో ఆలస్యం తరువాత కూడా ప్రభాస్ తో సినిమాలను నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ మళ్ళీ అదే తరహాలో ప్రవర్తించడం అభిమానులను మరింత ఆగ్రహానికి లోను చేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోతో వర్క్ చేసే నిర్మాతలకు ప్రమోషన్ విషయంలో అభిమానులు భారీ స్థాయిలో హెల్ప్ చేస్తారు. కానీ యూవీ పని తీరుకు నెగిటివ్ కామెంట్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

సరైన అప్డేట్ లేదు
రాధే శ్యామ్ సెట్స్ పైకి వచ్చి రెండేళ్లు దాటింది. అయినప్పటికీ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ స్లోగా ఉండడం డార్లింగ్ ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చడం లేదు. మిగతా ఫ్యాన్స్ హీరోలకు ఆయా నిర్మాణ సంస్థలు ఎదో ఒక అప్డేట్ ఇచ్చి మంచి కిక్కిస్తోంది. కానీ డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇంతవరకు సరైన అప్డేట్ లేదు.
Recommended Video

నిద్ర లే యూవీ క్రియేషన్స్
టీజర్ పై గత ఏడాది నుంచి అప్డేట్ ఇస్తున్నారు గాని టీజర్ ను మాత్రం వదలడం లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఏకంగా ఒక నెగిటివ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. 'నిద్ర లే యూవీ క్రియేషన్స్' అంటూ డైరెక్ట్ గా కౌంటర్ ఇస్తున్నారు. ఇండియా వైడ్ గా ఆ ట్యాగ్ వైరల్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. మరి ఇప్పుడైనా యూవీ క్రియేషన్స్ స్పందిస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











