యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయట్లేదు మరోసారి క్లారిఫై చేసిన రాజమౌళి
రాజమౌళి గురించి... ఆయన చేయబోయే సినిమాల గురించి ఏదో ఓ వార్త రావడం... ఆ వార్తను... ట్విట్టర్ వేదికగా చేసుకొని ఖండించడం మామూలైపోయింది. తాజాగా రాజమౌళి మరోసారి ఓ ఫాల్స్ న్యూస్ కు సంబంధించి వివరణ ఇచ్చారు. ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతున్న విషయంపై క్లారిఫికేషన్ ఇచ్చారు. త్వరలో జూనియర్ ఎన్టీఆర్ తో ఈ స్టార్ డైరెక్టర్.. మరో సినిమా చేయనున్నాడని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాల్ని ప్రకటించనున్నారనే గాసిప్ బయటికొచ్చింది.
అయితే ప్రస్తుతానికి యంగ్ టైగర్ తో ఎలాంటి సినిమా చేయట్లేదని రాజమౌళి చెప్పాడు. ఎన్టీఆర్ తో సినిమా ఇప్పుడు ప్లాన్ చేయలేదని అంటున్నాడు. అలాగే 3D సినిమాపై కూడా వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి త్రీడీ సినిమా తీయట్లేదని అన్నారు. ఇవన్నీ పుకార్లేనని తేల్చేశాడు. ప్రస్తుతం రూపొందిస్తున్న ఈగ టీజర్ కూడా ఇంకా రెడీ కాలేదట. ఇప్పుడు ఈగ క్లైమాక్స్ ని డిఫరెంట్ గా తెరకెక్కించడంలో బిజీగా ఉన్నానని జక్కన్న చెబుతున్నాడు. ఈ నేలాఖరులోగా ఈగ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశాడట. ఆ తర్వాత ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉండేలా ప్రణాళికలేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











