ప్రూఫ్స్ చూపిస్తూ చంద్రబాబుకు చెమటలు పట్టించిన వర్మ.. లేటెస్ట్ ట్వీట్

Recommended Video

RGV Conducted Opinion Poll On Twitter About Jr.NTR And TDP

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలను ఆపడం చంద్రబాబు నాయుడికి ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టిందో ఇప్పుడు తెలుస్తోంది. పోయి పోయి తన జోలికే వస్తే ఎలా ఉంటుందనేది వర్మ ప్రత్యక్షంగా చూపెడుతున్నారు. రోజుకో ట్వీట్ చేస్తూ టీడీపీ పార్టీ వెన్నువిరిచే పనే పట్టుకున్నారు వర్మ. ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న చంద్రబాబు నాయుడికి వర్మ పెద్ద సమస్యగా తయారయ్యాడనేది ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తే ఎవ్వరికైనా అర్థమైపోతుంది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం టీడీపీకి పూర్వ వైభవం తెచ్చే దమ్ము కేవలం తారక్‌కే ఉందంటూ వర్మ చేసిన కొన్ని ట్వీట్స్ పెద్ద దుమారమే లేపాయి.

బాబు ఉనికిని గంగలో పాతేస్తూ

బాబు ఉనికిని గంగలో పాతేస్తూ

చంద్రబాబు నాయుడు ఉనికిని గంగలో పాతేలా వర్మ వరుస ట్వీట్స్ చేసి.. టీడీపీ అధ్యక్షుడి వెన్నువిరిచారు వర్మ. ఈ మేరకు తారక్‌ని టీడీపీ పగ్గాలు చేతిలోకి తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసిన వర్మ.. ఈ ట్వీట్స్ మధ్యలో తారక్‌పై నెటిజన్ల అభిప్రాయాన్ని కూడా కోరుతూ ఓ ప్రశ్న వేసి పోల్ కండక్ట్ చేశారు.

టీడీపీకి తారక్ లీడర్ అయితే ఎలా ఉంటుంది..?

ఇటీవలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును నేరుగా టార్గెట్ చేశారు వర్మ. ఫలితాలు వెల్లడైన మరుక్షణం నుంచే రంగంలోకి దిగిన రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబుకు ఊపిరాడకుండా వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీకి తారక్ లీడర్ అయితే ఎలా ఉంటుంది..? అని నెటిజన్లకు ఓ ప్రశ్న సంధించారు వర్మ.

భారీ స్పందన

టీడీపీకి తారక్ లీడర్ కావాలనుకుంటున్నారా? అని రామ్ గోపాల్ వర్మ వేసిన ఈ ప్రశ్నకు నెట్టింట భారీ రెస్పాన్స్ వచ్చింది. పెద్ద ఎత్తున నెటిజన్లు దీనిపై రియాక్ట్ అయ్యారు.అయితే ఫైనల్‌గా చూస్తే 79 శాతం మంది నెటిజన్లు తారక్‌కే టీడీపీ పగ్గాలు అప్పజెప్పాలని, అప్పుడే టీడీపీ కోలుకుంటుందని తమ తమ స్పందన తెలియజేశారు.

ఇదిగో సాక్షం అంటూ.. వర్మ మరో చురక

ఇదిగో సాక్షం అంటూ.. వర్మ మరో చురక

ఈ ఓటింగ్ రిసల్ట్ చూపిస్తూ చంద్రబాబు నాయుడికి మరో చురక అంటించారు వర్మ. ఇదిగో 79 శాతం మంది జనం తారక్ చేతిలోనే టీడీపీ పగ్గాలుండాలని కోరుకుంటున్నారు. ఈ రిసల్ట్ ని బట్టి చూస్తే తారక్‌ని కోరుకునే వాళ్లలో టీడీపీ పార్టీకి చెందిన వారు కూడా ఉన్నట్లేనా? లేక బాబును కోరుకునే వారు కేవలం 21 శాతం ముందేనా? అని పేర్కొంటూ ట్వీట్ చేశారు వర్మ.

తారక్‌పై ఒత్తిడి పెరుగుతోందా..?

తారక్‌పై ఒత్తిడి పెరుగుతోందా..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మూటగట్టుకున్న పరాజయం చూస్తే ఇక భవిష్యత్తులో చంద్రబాబు వర్గాన్ని నమ్మే నాథుడే లేడని అర్థమైపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో టీడీపీ పగ్గాలు చేతిలోకి తీసుకోవాలంటూ వర్మతో పాటుగా అభిమానులు, ఇతర ప్రముఖుల నుంచి తారక్‌పై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం అందుతోంది.

More from Filmibeat

Read more about: tdp ram gopal varma
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X