నా సినిమా రిలీజ్ చేస్తే.. వకీల్ సాబ్‌కి వసూళ్ళు లేకుండా పోతాయి.. శ్రీరెడ్డి షాకింగ్ ట్రైలర్
టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా కాంట్రవర్సీ టాపిక్స్ తో మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్న శ్రీ రెడ్డి ఎప్పటికప్పుడు జనాలు తనను మర్చిపోకుండా అడుగులు వేస్తోంది. యూ ట్యూబ్ ఇంటర్వ్యూలతోనే కాకుండా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో కూడా రెగ్యులర్ గా నెటిజన్లకు షాక్ ఇచ్చే విధంగా ఫొటోలను వదులుతోంది. అయితే ఇటీవల ఆమె మరోసారి పవన్ కళ్యాణ్ పై కామెంట్ చేయడం వైరల్ గా మారింది.

ట్రైలర్ వదిలిన శ్రీ రెడ్డి
అంశం ఏదైనా కూడా గతంలో చాలా సార్లు శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఎవరు ఉహీంచని విధంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఎలక్షన్స్ తరువాత కాస్త కొన్నాళ్ళు విమర్శలు తగ్గించినప్పటికి ఎప్పుడో ఒకసారి పవన్ పై కామెంట్ చేస్తూనే ఉంది. ఇక రీసెంట్ గా ఆమె నటించిన సినిమా యొక్క ట్రైలర్ ను వదిలి సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా కామెంట్ చేసింది.

రాజేంద్రప్రసాద్ కీలకపాత్రలో..
సీనియర్ నటులు నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఒక క్లైమాక్స్ సినిమాలో కూడా శ్రీరెడ్డి కీలక పాత్రలో నటించింది. చాలా రోజుల తరువాత రాజేంద్రప్రసాద్ ఒక వివాదస్పద పాత్రలో కనిపించడానికి సిద్ధమయ్యారు. ఆ పాత్ర బిజినెస్ మెన్ విజయ్ మాల్యా ఆధారంగా క్రియేట్ చేసినట్లుగా తెలుస్తోంది.

శ్రీరెడ్డి స్పెషల్ పాత్రలో..
ఇక సినిమాలో మిగతా పాత్రలు కూడా ఇదే తరహాలో ఉంటాయని సమాచారం. క్లైమాక్స్ అనే టైటిల్ సెట్ చేసిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ప్రసాద్ తో పాటు పృద్వి రాజ్, శివ శంకర మాస్టర్ వంటి ప్రముఖులు ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. ముఖ్యంగా శ్రీ రెడ్డి కూడా ఇందులో స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నట్లు ట్రైలర్ ద్వారా అర్ధమయ్యింది.

క్లైమాక్స్.. రిలీజ్ కు సిద్ధమే..
సినిమాపై బజ్ క్రియేట్ అయ్యే విధంగా శ్రీ రెడ్డి బ్రాండ్ ను వాడుతున్నట్లు అర్ధమవుతోంది. తన నిజ జీవితంలో ఉండే లక్షణాలను ఈ సినిమాలోని పాత్ర ద్వారా చూపించబోతున్నట్లు శ్రీ రెడ్డి గత ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇక ఈ క్లైమాక్స్ సినిమా షూటింగ్ కూడా ఆల్ మోస్ట్ పూర్తయినట్లు సమాచారం. ఇక సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి కాబట్టి సినిమాను త్వరలోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
Recommended Video

వకీల్ సాబ్ మూవీకి పోటీగా..
ఇక శ్రీ రెడ్డి సినిమా రిలీజ్ పై స్పందిస్తూ మరోసారి పవన్ కళ్యాణ్ పేరును కూడా లాగేసింది. "నా మూవీ ని పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ కి పోటీగా రిలీజ్ చేస్తా , నా సినిమా కలెక్షన్ కి వకీల్ సాబ్ కి వసూళ్ళు లేకుండా పోతాయి' అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











