మరోసారి రిలీజ్ అవుతున్న RRR.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడంటే?
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారి మెగా నందమూరి హీరోలు కలిసి నటించిన సినిమా RRR. పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ సినిమా ఈ ఏడాది మార్చి 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. ఇక బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇక ఈ సినిమాకు విదేశాల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో విడుదల చేసిన తర్వాత హాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.

ఇక ఆస్కార్ వేడుకలో కూడా ఈ సినిమా హైలెట్ కాబోతోంది. సినిమాకు సంబంధించిన నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో సినిమాను వెండితెరపై మరోసారి విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమాను మళ్లీ విడుదల చేయగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
మార్చి 10వ తేదీన RRR సినిమాను మళ్ళీ విడుదల చేయబోతున్నారు. మళ్లీ విడుదల చేస్తే కూడా చూడడానికే ఆడియన్స్ అయితే చాలా సిద్ధంగా ఉన్నారు. రీ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఎడిట్ లో లేపేసిన సన్నివేశాలను యాడ్ చేస్తారా అని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఆ విషయంలో రాజమౌళి ఏదైనా క్లారిటీ ఇస్తాడో లేదో చూడాలి. ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











