twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వన్స్ మోర్ ప్లీస్!

    By Sindhu
    |

    పూర్వం పల్లెటూర్లలో డ్రామాలు ప్రదర్శించినప్పుడు ఎవరైనా ఓ నటుడు తన పద్యాన్ని బాగా ఆలపించినా.. లేదా డైలాగులు బాగా చెప్పినా..ప్రేక్షకులు 'వన్స్‌మోర్‌" అని కేకలు వేసి..ఆ పద్యాలు మళ్లీ పాడించుకునేవారు. ఆడియన్స్‌ 'వన్స్‌మోర్‌" అని అరిస్తే..ఎంతటి క్లిష్టమైన పద్యమైనా, డైలాగ యినా..మళ్లీ చెప్పి తీరాల్సిందేనన్న అనధికార నిబంధన కూడా అప్పట్లో అమల్లో ఉండేదని పెద్దలు చెబుతుంటారు. సినిమారంగానికి సంబంధించి కొన్ని కాంబినేషన్లకు కూడా ఆడియన్స్‌ ఇలాగే 'వన్స్‌మోర్‌"లు చెబుతుంటారు. ఆడియన్స్‌ అభీష్టాన్ని శిరసావహించి..మన దర్శకనిర్మాతలు ఆ క్రేజీ కాంబి నేషన్స్‌ను రిపీట్‌ చేస్తుంటారు.

    మరి తాజాగా రిపీట్‌ అవుతున్న కొన్ని క్రేజీ కాంబినేషన్లను ఇక్కడ చూడండి ఎంత క్రేజిగా ఉన్నాయో 'కింగ్‌" చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన మమతామోహన్‌దాస్‌-నాగార్జునల మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని అందరూ భావించారు. నాగార్జునతోపాటు, చిత్ర నిర్మాత డి.శివప్రసాద్‌రెడ్డి కూడా అలాగే భావించడంతో 'కేడి" చిత్రంలో చోటు దక్కించుకుంది మమత. అలాగే..సూపర్‌ హిట్‌ చిత్రం 'కృష్ణ"లో జంటగా నటించిన రవితేజ-త్రిషలను మరోసారి జంటగా చూడడానికి ఆడియన్స్‌ ఇష్టపడతారని భావించిన ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌..తమ తాజా చిత్రంలో వీరిద్దరినీ హీరోహీరోయిన్లుగా తీసుకుంది. పైగా ఈ సంస్థ రవితేజతో గత సంవత్సరం నిర్మించిన 'కిక్‌" అసాధారణ విజయం సాధించడం ఈ చిత్రానికి మరో ముఖ్య ఆకర్షణ.

    అదేవిధంగా..'ఖుషీ" కాంబినేషన్‌ పవన్‌ కళ్యాణ్‌-యస్‌.జె.సూర్యలతో నిర్మిత మవుతున్న 'పులి", 'అతడు" కాంబినేషన్‌ మహేష్‌ బాబు-త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం పట్లా ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలున్నాయి. అలాగే 'బన్ని" కాంబినేషన్‌ వి.వి.వినాయక్‌-అల్లు అర్జున్‌ లతో ఇటీవల ఓ చిత్రం ప్రకటితమవ్వడం తెలిసిందే. గీతా ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాణం కానున్న ఈ చిత్రానికి 'బద్రినాద్‌" అనే పేరును పరిశీలిస్తున్నారు!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X