సిల్క్ స్మిత సూసైడ్ సీక్రెట్స్.. చనిపోవడానికి ఒక్క రోజు ముందు ఏం జరిగిందంటే!

సిల్క్ స్మిత.. నాటితరం నుంచి నేటితరం వరకు ఈ పేరు తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులకు మైకం తెప్పిస్తూ తన అంచందాలతో కైపెక్కించిన సిల్క్ స్మిత జీవితం అర్దాంతరంగా ముగిసింది. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో సినీ వర్గాలను కుదిపేసింది. అయితే తాజాగా సిల్క్ స్మిత సూసైడ్‌కి సంబంధించిన ప్రస్తావన తెస్తూ షాకింగ్ సంగతులు చెప్పాడు నటుడు వీ రవిచంద్రన్. ఆ వివరాలు చూద్దామా..

క్రేజీ యాక్టర్‌తో సిల్క్ స్మిత రిలేషన్

క్రేజీ యాక్టర్‌తో సిల్క్ స్మిత రిలేషన్

కన్నడ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు వీ రవిచంద్రన్. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా పేరొందిన ఆయనకు సిల్క్ స్మితతో మంచి స్నేహం ఉండేది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కన్నడ మీడియా సంస్థతో ముచ్చటించిన ఆయన.. సిల్క్ స్మిత సూసైడ్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.

 సిల్క్ స్మితతో కలిసి.. అలా స్నేహం ముదిరింది

సిల్క్ స్మితతో కలిసి.. అలా స్నేహం ముదిరింది

1992లో సిల్క్ స్మిత, వీ రవిచంద్రన్ కలిసి హల్లి మేస్త్రు అనే సినిమాలో నటించారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య స్నేహం ముదిరింది. తనతో చనిపోయే ముందు రోజు వరకూ సిల్క్ స్మిత చాలా స్నేహంగా ఉండేదని వీ రవిచంద్రన్ తెలిపాడు. ఆమె తనతో ఎంతో గౌరవంగా ఉండేదని, అలాగే తానూ ఆమె పట్ల గౌరవంగా మెదిలేవాడినని అన్నాడు.

షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. ఓ ఫోన్ కాల్

షూటింగ్‌లో బిజీగా ఉన్నా.. ఓ ఫోన్ కాల్

సిల్క్ స్మిత చనిపోవటానికి ముందు రోజు తనకు ఫోన్ కాల్ చేసిందని నటుడు వీ రవిచంద్రన్ తెలిపాడు. బహుశా ఆమె తనను కలవాలని ప్రయత్నించిందేమో కానీ.. అది సాధ్యం కాలేదని చెప్పాడు. తాను ఓ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా సిల్క్ స్మిత నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, అయితే ఏదో రొటీన్ కాల్ అని, ఊరికే చేస్తుందేమో అని తాను అనుకున్నానని చెప్పాడు రవిచంద్రన్.

1996 సంవత్సరం సెప్టెంబర్ 23

1996 సంవత్సరం సెప్టెంబర్ 23

1996 సంవత్సరం సెప్టెంబర్ 23వ తేదీన తనకు సిల్క్ స్మిత కాల్ చేసిందని ఆయన అన్నాడు. ఆ సమయంలో ఆమెతో మాట్లాడాలని ట్రై చేసినా.. టెక్నికల్, పూర్ సిగ్నల్ కారణంగా మాట్లాడలేక పోయానని చెప్పాడు రవిచంద్రన్. ఆ తర్వాత మరుసటి రోజు ఆమె సూసైడ్ చేసుకోవడంతో షాక్ అయ్యానని ఆయన చెప్పాడు. ఆ సంఘటన తనను నేటికీ వెంటాడుతోందని తెలిపాడు.

సిల్క్ స్మిత అసలు పేరు.. సినీనటి కావాలనే ఆకాంక్షతో

సిల్క్ స్మిత అసలు పేరు.. సినీనటి కావాలనే ఆకాంక్షతో

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె 1960, డిసెంబరు 2న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సమీపంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. 4వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పింది. సినీనటి కావాలనే ఆకాంక్షతో మద్రాసులోని వాళ్ళ అత్తింటికి వెళ్ళింది. ల్క్ స్మిత మొదటి చిత్రం తమిళంలో వండి చక్రం (బండి చక్రం). 1979లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. ఈ పాత్రకు విశేష ఆదరణ లభించడంతో.. ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది.

200పైగా చిత్రాలు.. తెలుగులో బావలు సయ్యా

200పైగా చిత్రాలు.. తెలుగులో బావలు సయ్యా

200పైగా తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ చిత్రాలలో నటించింది సిల్క్ స్మిత. అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు అమెకు అత్యంత జనాదరణను తెచ్చి పెట్టాయి. తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట నేటికీ సిల్క్ స్మిత ఓ ఐకాన్ అని తెలుపుతుంది.

Recommended Video

Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
జీవితాంతం అవివాహిత గానే.. డెత్ మిస్టరీ

జీవితాంతం అవివాహిత గానే.. డెత్ మిస్టరీ

సిల్క్ స్మిత తన జీవితాంతం అవివాహిత గానే ఉంది. 1996, సెప్టెంబరు 23న మద్రాసులోని తన నివాస గృహంలో సూసైడ్ చేసుకుంది. అంతకు ముందు ఆమె ప్రేమ వ్యవహారాలు విఫలమయ్యాయని, చిత్ర నిర్మాణ ప్రయత్నంలో నష్టాల పాలైందని, అందుకే సూసైడ్ చేసుకుందని వార్తలు వచ్చాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X