ఎప్పటికైనా సూపర్ స్టార్ ని అవుతా: క్యూట్-హాట్ హన్సిక
దేశముదురుతో తెరంగేట్రం చేసిన హన్సిక ఆ సినిమాతో సిమ్లా యాపిల్ లా ఉంది అనిపించుకుంది. తరువాత వరుస సినిమాలతో యూత్ లో మంచి ఇమేజే క్రియేట్ చేసుకోగల్గింది. ఎన్టీఆర్ సరసన కంత్రీ పిల్ల అనిపించింది. ఇక రీసెంట్ గా బొద్దుగా మారి కందిరీగలా మరో సారి యూత్ ను కుట్టేసి ఆకట్టుకుంది. ఇప్పుడు సిద్దార్ద్ ఓ మై ఫ్రెండ్ సినిమాలో నటించింది.
కేవలం ఇరవై ఏళ్ల వయసులోనే పద్దెనిమిది సినిమాల్లో నటించేసింది ఇటీవలి కాలంలో బొద్దుగా, ముచ్చటగా తయారైన హన్సిక. సిద్ధార్థ్ కు జోడీగా 'ఓ మై ఫ్రెండ్'లో మెరిసిన ఆమె ముద్దు సీన్లలో యువతని మరీ మురిపించింది. నిన్న 'కందిరీగ', నేడు 'ఓ మై ఫ్రెండ్' విజయాలతో కొంత గ్యాప్ తర్వాత తెలుగులో ఆమె కెరీర్ ఊపందుకుందని చెప్పాలి.
తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమెకి మంచి అవకాశాలు వస్తుండటం గమనార్హం. 'నేనింకా ఎంతో కాలం ఈ ఇండస్ట్రీలో ఉండాలి. ఏదో ఒకరోజు నేను సూపర్ స్టార్ ని అవుతాననే నమ్మకం ఉంది. అయితే నా వరకు దానికి అంత ప్రాముఖ్యం లేదు. బాలనటిగా చేస్తున్నప్పట్నించీ ఇండస్ట్రీని అర్థం చేసుకుంటూ వస్తున్నా. నిచ్చెన నుంచి కింద పడటానికి ఒక్క ఫ్లాప్ చాలనేది నాకు బాగా తెలుసు' అని చెబుతుంది హన్సిక.
'ఆప్ కా సురూర్', 'మనీ హై తో హనీ హై' సినిమాల తర్వాత ఆమె మళ్లీ ఏ హిందీ సినిమా చేయలేదు. అక్కడ ప్రతి యాక్టర్ని ఎవరితోనో ఒకరితో లింకులు కలిపేయడం మామూలు విషయం. అది నచ్చకనే ఆమె దక్షిణాదివైపు ఎక్కువగా దృష్టి పెడుతోంది. 'నేనేదైనా గొప్ప విషయం సాధించి వార్తల్లో నిలవడానికి ఇష్టపడతాకానీ తప్పుడు కారణాలతో వార్తల్లో వ్యక్తి కావడం ఏమాత్రం ఇష్టంలేదు' అని సూటిగా చెప్పేస్తుంది ఈ బ్యూటీ.


Click it and Unblock the Notifications











