ప్రభాస్ నటించిన బిల్లా ప్రదర్శిస్తున్న థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వైజాగ్ దగ్గరలో కంచర పాలెంలో ఉన్న ఊర్వశి ధియోటర్ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. శనివారం మధ్నాహ్నం షోకు 10రూపాయల టికెట్ కౌంటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో వంకా కామేష్ (18) అనే యువకుడు చనిపోయాడు. దీంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడి బంధువులు థియేటర్ యాజమన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు గుప్పించారు.