»   » సెక్స్ వీడియోతో బెదిరింపులు, నటి నయనపై మరో కేసు

సెక్స్ వీడియోతో బెదిరింపులు, నటి నయనపై మరో కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కన్నడ నటి నయన కృష్ణ బ్లాక్ మోయిలింగ్ భాగోతం ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇటీవల ఆమెపై ఓ వైద్యుడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సదరు వైద్యుడిపై రహస్యంగా చిత్రీకరించిన సెక్స్ వీడియోలు చూపి నయన కృష్ణ అండ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. తొలుత బెదిరింపులకు భయపడి కొంత డబ్బు ముట్టజెప్పిన సదరు వైద్యుడు....వారు మరింత డబ్బు కావాలని మళ్లీ బెదిరించడంతో చివరకు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు పథకం ప్రకారం..... నయన కృష్ణ గ్యాంగ్ మెంబర్స్‌లో ఇద్దరి పట్టుకున్నారు. ఒకరు తప్పించుకున్నారు.

వైద్యుడి ఫిర్యాదుతో......ఆమె వలలో చిక్కుకున్న మరికొందరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా కృష్ణప్ప అనే మరో వ్యక్తి నయన కృష్ణపై ఫిర్యాదు చేసారు. 2010లో తన సెక్స్ వీడియోలో తీసి బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేసారు.

నయన కృష్ణ గ్యాంగ్ మెంబర్స్

నయన కృష్ణ గ్యాంగ్ మెంబర్స్


నయన కృష్ణ గ్యాంగులో ఆమె స్నేహితులు మేఘన, రిహానాలతో పాటు కానిస్టేబుల్ మల్లేష్, ప్రైవేట్ టీవీ ఛానల్లో పని చేస్తున్న హేమంత్ కుమార్, సునీల్, జిమ్ నిర్వాహకుడు రఘు ఉన్నారు.

పథకం ప్రకారం బ్లాక్ మెయిలింగ్

పథకం ప్రకారం బ్లాక్ మెయిలింగ్


వీరంతా కొందరు డబ్బున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం సెక్స్ వీడియోలు చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడుతున్నారు.

ఇద్దరు దొరికిపోయారు

ఇద్దరు దొరికిపోయారు


ఇటీవల పోలీసులు పథకం ప్రకారం ఇద్దరి అరెస్టు చేసారు. వైద్యుడి వద్ద డబ్బు తీసుకోవడానికి వచ్చి హేమంత్ కుమార్, సునీల్ అరెస్ట్ అయ్యారు.

నయన కృష్ణ కోసం గాలింపులు

నయన కృష్ణ కోసం గాలింపులు


నయన కృష్ణకు సినీ పరిశ్రమలో ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. ఆమె బ్లాక్ మెయిలింగు ఉచ్చులో చాలా మంది చిక్కుకున్నా....పరువు పోతుందనే భయంతో ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

English summary
A city-based businessman has accused Kannada actor Nayana Krishna of blackmail and extortion. a businessman, filed a complaint with the Wilson Garden police accusing Nayana of blackmailing him by filming him in a compromising position with a woman and extorting Rs. 2 lakh in 2010. He alleged that Nayana threatened to share a video of him with an escort with TV news channels if he did not pay the money.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu