మహేష్ ఫ్యామిలీ నుంచి మరో బుడ్డోడు.. ఈ బుల్లి గూఢచారి ఎవరంటే!
ఘట్టమనేని కుటుంబంలో సూపర్ స్టార్ కృష్ణతో మొదలైన నట ప్రస్థానం మహేష్ బాబుతో విజయవంతగా కొనసాగుతోంది. మరో వైపు మహేష్ బావ సుధీర్ బాబు కూడా సినిమాల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంకా ఈ కుటుంబంలో మూడవ తరం నటులు సిద్ధం అవుతున్నారు. 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ కుమారుడు గౌతమ్ కృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు.
తాజగా విడుదలై అందరిలో ఉత్కంఠ రేపుతున్న గూఢచారి చిత్రంలో మహేష్ ఫ్యామిలీ నుంచి మరో బుల్లి నటుడు పరిచయం అయ్యాడు. సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వడం విశేషం. గూఢచారి ట్రైలర్ లో కూడా దర్శన్ ని చూపించారు. దర్శన్ ఈ చిత్రంలో చిన్న నాటి అడవి శేష్ గా నటించాడు.

నాని నటించిన భలే భలే మగాడివోయ్ చిత్రంలో సుధీర్ బాబు పెద్ద కుమారుడు చరిత్ మానస్ నటించిన సంగతి తెలిసిందే. నెమ్మదిగా మహేష్ ఫ్యామిలీ నుంచి నట వారసులు పెరుగుతున్నారు.


Click it and Unblock the Notifications











