twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునను అరెస్ట్ చేయాల్సిందే: మన్మథుడి పై మరో కొత్త కేసు

    చలపతి రావు చేసిన వ్యాఖ్యలు మాత్రం నాగార్జునకి కొత్త చిక్కులే తెచ్చిపెట్టాయి. చలపతిరావుతోపాటు నాగార్జునను కూడా అరెస్ట్‌ చేయించాలని చైతన్య మహిళాసంఘం డిమాండ్‌ చేస్తోంది.

    |

    మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటుడు చలపతిరావుపై ఆగ్రహం ఇంకా చల్లారలేదు. ఆయన పై పలు ప్రాంతాల్లో వరుస కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అమ్మాయిలు కేవలం పడక సుఖానికే పనికి వస్తారు అన్న ఉద్దేషం వచ్చేట్టు గా "రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ఆడియో వేడుకలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    టెక్నికల్ ప్రాబ్లం వల్ల

    టెక్నికల్ ప్రాబ్లం వల్ల

    ఈ వ్యాఖ్యల పై దుమారం చెలరేగటం తో చలపతి రావు సహా ఆ సమయం లో అక్కడ ఉన్న నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్, నాగార్జునలు సైతం వివరణ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్న మేల్ యాంకర్ రవి మాత్రం చలపతిరావు ఏమి మాట్లాడారో నాకు అర్థం కాలేదు. టెక్నికల్ ప్రాబ్లం వల్ల అది ఏర్పడింది అని చెప్పి తప్పించుకోవటం.,

    పఠాస్ ప్రోగ్రాం

    పఠాస్ ప్రోగ్రాం

    అంతేకాకుండా పటాస్ జోడి శ్రీముఖితో తన ప్రవర్తన గురించి, టెక్నికల్ ప్రాబ్లం గురించి రవి వివరణ ఇప్పించడం తో అతని మీద కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ ఇద్దరి మీదా ఇంకా పలు చోట్ల కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అంతే కాదు అతను నిర్వహించే పఠాస్ ప్రోగ్రాం కూడా మరీ బూతు కంటెంట్ తో ఉంది కాబట్టి దాన్ని కూడా నిషేదించాలి అనే వరకూ వెళ్ళింది వ్యవహారం.

    నిర్భయ చట్టం కింద కేసు

    నిర్భయ చట్టం కింద కేసు

    తాజా గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్‌ ప్రధాన కార్య దర్శి ఉజ్మాషాకీర్‌ గురువారం రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రారండోయ్‌ వేడుక చూద్దాం ఆడియో వేడుకలలో చలపతిరావు వ్యాఖ్యలు మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆయన పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరారు.

    నాగార్జునను అరెస్టు చేయాలి.

    నాగార్జునను అరెస్టు చేయాలి.

    మహిళల గురించి అసభ్యంగా మాట్లాడిన నటుడు చలపతిరావుతోపాటు ఆయన వ్యాఖ్యలను లైవ్‌ప్రసారం చేయించిన నాగార్జునను కూడా అరెస్ట్‌ చేయించాలని చైతన్య మహిళాసంఘం డిమాండ్‌ చేసింది. చలపతిరావు వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం అధ్యక్షురాలు పి.జయ, ప్రధాన కార్యదర్శి రాధ ఓ ప్రకటనలో కోరారు.

    నాగార్జునకి కొత్త చిక్కులే

    నాగార్జునకి కొత్త చిక్కులే

    ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు చలపతి రావు చేసిన వ్యాఖ్యలు మాత్రం నాగార్జునకి కొత్త చిక్కులే తెచ్చిపెట్టాయి. ఇప్పటికే తాను ఎప్పుడూ మహిళలని కించపరచలేదనీ, ఆ వ్యాఖ్యలను కూడా ఖండిస్తున్నాననీ వివరణ ఇచ్చుకున్న నాగ్. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అన్న ట్యాగ్ లైన్ ని కూడా తొలగించాడు. అయినా అప్పటికే ఎంత డామేజ్ జరగాలో అంతా జరిగి పోయింది... చూడాలి నాగ్ ఈ సమస్యలనుంచి ఎలా బయట పడతారోమరి.

    English summary
    One More Case Filed On Chalapathi Rao in Rajendra nagar Police station After His Derogatory Comments On Women
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X