మంచు వారింట మరో అమ్మాయి.. విష్ణు నాలుగో సంతానం
మంచు వారింట్లోకి మరో అమ్మాయి వచ్చేసింది. అదేనండీ మంచు విష్ణు మరోసారి తండ్రి అయ్యాడు. మంచు విష్ణు- విరానికా దంపతులకు నాలుగో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయాన్ని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు మంచు విష్ణు.

ఇప్పటికే ముగ్గురు పిల్లలు
మంచు విష్ణు- విరానికా దంపతులకు ఇప్పటికే ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు అమ్మాయిలు కాగా, ఒక అబ్బాయి. ఈ దంపతులకు మొదటి సంతానంగా ట్విన్స్ పుట్టారు. ఆ ఇద్దరు అమ్మాయిలే. ఆ తరువాత బాబు జన్మించాడు. ఇప్పుడు మరోసారి ఆడబిడ్డ జన్మించింది.
ఆనందంతో మంచు విష్ణు ట్వీట్
ఈ విషయాన్ని మంచు విష్ణు ట్విట్టర్ తెలుపుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘Its a girl, Its a girl' అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టాడు.ఈ ట్వీట్ చూసిన విష్ణు అభిమానులు ''వరలక్ష్మీ వ్రతం నాడు ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఆ లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే. ఇకపై మీ కుటుంబానికి అన్నీ శుభాలే'' అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మంచు వారింట నాలుగో అమ్మాయి
విష్ణు దంపతులకు ఇప్పటికే వివియానా, ఆరియానా అనే ఇద్దరు ఆడపిల్లలు ఉండగా, మంచు లక్ష్మి సరోగసీ విధానం ద్వారా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ రోజు జన్మించిన ఆడబిడ్డతో మంచు వారింట నాలుగో అమ్మాయి జన్మించినట్లయింది. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగితేలుతోంది.

డెలవరీకి ముందు మంచు విష్ణు
ఇక విరానికా డెలవరీని ఇన్‌స్టా పేజీలో లైవ్ పెట్టేస్తా అంటూ ఆమె డెలివరీకి ముందు మంచు విష్ణు ట్వీట్ చేయడం, దీంట్లో కాజల్ పేరును లాగటం.. ఆపై విరానికా కాజల్ పై సరదాగా మండిపడటం లాంటి సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు, విరానికా పెట్టిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయి చర్చనీయాంశం అయ్యాయి.

మంచు విష్ణు మూవీస్
కెరీర్ పరంగా చూస్తే మంచు విష్ణు వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే ఆయన 'ఓటర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కాస్త డీలా పడ్డాడు. ప్రస్తుతం ఆయన సరైన కథ కోసం వెతుకుతున్నాడు. కెరీర్ లో సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











