కమెడియన్‌తో వివాదం..సినిమా సెట్‌లోనే.. చెంప దెబ్బపై స్పందించిన ప్రకాష్ రాజ్!

Recommended Video

Prakash Raj Is Into One More Controversy

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తరచుగా ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ప్రకాష్ రాజ్ నటన పరంగా ఎంత ప్రతిభావంతుడో అందరికి తెలిసిందే. కానీ పలు వివాదాల్లో ప్రకాష్ రాజ్ దర్శనమిస్తుంటాడు. తాజగా ప్రకాష్ రాజ్ గురించి సంచల వార్త వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనం ప్రకారం.. హీరో రామ్ నటిస్తున్న హలో గురు ప్రేమ కోసమే సినిమా సెట్ లో వివాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కమెడియన్ సప్తగిరితో తీవ్రమైన వివాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజగా ప్రకాష్ రాజ్ స్పందించారు.

 కమెడియన్ చెంప చెళ్లుమనిపించేలా

కమెడియన్ చెంప చెళ్లుమనిపించేలా

హలొ గురు ప్రేమ కోసం చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన రైల్వేస్టేషన్ సెట్ లో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్ లో ప్రకాష్ రాజ్ కమెడియన్ సప్తగిరి చెంప చెళ్లుమనిపించినట్లు వార్తలు వస్తున్నాయి.

పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

 వందలాది మంది సెట్‌లో

వందలాది మంది సెట్‌లో

వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు సెట్ లో ఉండగానే ఉన్న పళంగా ప్రకాష్ రాజ్ కమెడియన్ సప్తగిరిని కొట్టారట. ప్రకాష్ రాజ్ సప్తగిరిని ఎందుకు కొట్టవలసి వచ్చిందో కారణాలు బయటకు రాలేదు. చిత్ర నిర్మాత దిల్ రాజు సెట్ లో ఉండగానే ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

 సైలెంట్‌గా ఉండమని

సైలెంట్‌గా ఉండమని

ఈ ఘటన గురించి ఎవరూ ఎక్కడా మాట్లాడవద్దని దిల్ రాజు ఆదేశించినట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఘటనకు సంబందించిన వాస్తవాలు బయటకు రాలేదని ప్రచారం జరుగుతోంది. తాజగా ప్రకాష్ రాజ్ ఈ వార్తలపై స్పందించారు.

 శుభాకాంక్షలు తెలియజేశా

శుభాకాంక్షలు తెలియజేశా

ఈ ఘటన గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. జరుగుతున్న ప్రచారం మొత్తం అబద్దం అని ఖండించారు. నేనెందుకు సప్తగిరిని కొడతాను. అతడు ఎదుగుతున్న నటుడు. తొలి చిత్రానికి దర్శత్వం వహించబోతున్నాడని తెలిసి సప్తగిరి శుభాకాంక్షలు కూడా తెలిపా అని ప్రకాష్ రాజ్ అన్నారు. రాబోవు రోజుల్లో కూడా అతడితో కలసి నటించబోతున్నా అని తెలిపారు.

 అదికూడా అబద్దమే

అదికూడా అబద్దమే

గతంలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ని తిట్టినట్లు కూడా ప్రకాష్ రాజ్ గురించి వార్తలు వచ్చాయి. అవి కూడా నాన్ సెన్స్ అంటూ ప్రకాష్ రాజ్ కొట్టిపారేశాడు. ఆమె డైలాగ్ తప్పుగా చెబుతుంటే సరిచేసాను అంతే అని ప్రకాష్ రాజ్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X