మహానటి డిలీటెడ్ సీన్: రాజేంద్ర ప్రసాద్ అలా చేసేసరికి కెవ్వుమని అరుస్తున్న కీర్తి!
మహానటి చిత్రం విడుదలై దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహానటిగా సావిత్రి దక్షిణాదిలో చెరగని ముద్ర వేసింది. ఆమె పాత్రలో నటించడం కత్తిమీద సాములాంటి పనే. కానీ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిందనే ప్రశంసలు దక్కుతున్నాయి.
విడుదల తరువాత కూడా చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు వసూళ్లు మరింతగా పెరగడానికి కారణం అవుతున్నాయి. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ములేపుతోంది. తాజగా చిత్రం యూనిట్ డిలీటెడ్ సీన్ పేరుతో మరో సన్నివేశాన్ని విడుదల చేశారు.

నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, కీర్తి సురేష్ మధ్య సాగే ఈ సన్నివేశం చాలా సరదాగా, హాస్యభరితంగా ఉంది. కీర్తి సురేష్ భుజంపై రాజేంద్రప్రసాద్ గిల్లగానే ఆమె కెవ్వుమని అరుస్తూ పలికించే హావభావాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications











