సల్మాన్ ఖాన్, షారుఖ్ బ్లాక్ బస్టర్ చిత్రంతో చరణ్, ఎన్టీఆర్ సినిమాకు లింకు..!

Recommended Video

One More Interesting News About RRR Movie Story

దర్శకధీరుడు రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి సినీ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. ఈ చిత్రం కథ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రస్తుతం కథకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రం ఓ బాలీవుడ్ చిత్రం స్పూర్తితో రూపొందుతోందని అంటున్నారు.

అందరి చూపు వీరిపైనే

అందరి చూపు వీరిపైనే

ప్రస్తుతం టాలీవుడ్ లో అనేక ఆసక్తికరమైన చిత్రాలు రూపొందుతున్నాయి. కానీ అందరి చూపు మాత్రం రాజమౌళి, ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంపైనే ఉంది. అంతాలా ఈ చిత్రం సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.

కథపై అనేక ఉహాగానాలు

కథపై అనేక ఉహాగానాలు

బాహుబలి వంటి జానపద తరహా కథతో తెలుగు సినిమా సత్తాని రాజమౌళి ప్రపంచానికి చాటి చెప్పాడు. బాహుబలి తరువాత రూపొందిస్తున్న చిత్రం కావడంతో రాజమౌళి ఎలాంటి కథతో రాబోతున్నాడు అనే ఉత్కంఠ నెలకొని ఉంది. బాక్సింగ్ నేపథ్యంలో అంటూ ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని రాంచరణ్ ఓ సందర్భంలో తెలియజేశాడు.

 బాలీవుడ్ సినిమా కథతో

బాలీవుడ్ సినిమా కథతో

సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ నటించిన కరణ్ అర్జున్ చిత్రం తెలిసే ఉంటుంది. 1995 లోవచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలుచేసింది. రివేంజ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని అలరించింది. ఈ చిత్రం ఆధారంగానే రాజమౌళి మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏడాది చివర్లో

ఏడాది చివర్లో


కరణ్ అర్జున్ చిత్రం ఆధారంగా రాజమౌళి సినిమా రూపొందుతుందనే వార్తలపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్ వారి వారి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది చివరికల్లా సినిమాని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X