twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీదేవి మృతికి మరో కారణం..15 శాతం కార్డియాక్ అరెస్టులు అందుకే!

    |

    Recommended Video

    Sridevi Passes Away : అందమే శాపమైందా, అవే ప్రాణాలకు ముప్పు తెచ్చాయా?

    శ్రీదేవిని అకాల మృత్యువు కబళించేసింది. శ్రీదేవి ఆరోగ్యంలో సమస్యలు తలెత్తాయని ఎప్పుడో ఎవరూ వినింది లేదు. శ్రీదేవి ఐదు పదుల వయసులో కూడా నవ యవ్వనంగా చలాకీగా మరణానానికి కొన్ని గంటల ముందు కనిపించారు. కానీ ఆమె అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలడం తుదిశ్వాస విడవడం జరిగిపోయింది. శ్రీదేవి విషయంలో ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్నకు అనే రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

    ఆరోగ్య సమస్యలు లేని అందాల తార

    ఆరోగ్య సమస్యలు లేని అందాల తార

    శ్రీదేవి తన సినీ జీవితంలో వివాహం అనంతరం కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యతో భాదపడలేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. శ్రీదేవి కార్డియాక్ అరెస్ట్ కు గురికావడంతో తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని శ్రీదేవి సన్నిహితులు వెల్లడిస్తున్నారు.

    ప్లాస్టిక్ సర్జరీలు ఏమైనా

    ప్లాస్టిక్ సర్జరీలు ఏమైనా

    నిత్య యవ్వనం కోసం సినీతారలు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. శ్రీదేవి కూడా తన అందానికి శస్త్ర చికిత్స ద్వారా మెరుగులు దిద్దుకుంది అనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్లాస్టిక్ సర్జరీలు వికటించిన సందర్భాలు ఉన్నాయి.

    శ్రీదేవి శరీరంలో మార్పులు

    శ్రీదేవి శరీరంలో మార్పులు

    ఇటీవల కాలంలో శ్రీదేవి శరీరంలో స్పష్టంగా మార్పులు కనిపించాయి. ఆమె బాగా సన్నబడినట్లు కనిపించారు.

    మరో కారణం కుమార్తెలేనా

    మరో కారణం కుమార్తెలేనా

    15 శాతం కార్డియాక్ అరెస్టులు మానసిక ఒత్తిడి వల్లనే కలుగుతాయని హార్ట్ స్పెషలిస్ట్ లు స్పష్టం చేస్తున్నారు. తన కుమార్తెలని హీరోయిన్లని చేసే భాద్యత స్వయంగా శ్రీదేవి తీసుకున్నారు. శ్రీదేవితో మానసిక ఒత్తిడి పెరగడానికి ఇది కూడా ఓ కారణం అయి ఉండొచ్చనే వాదన వినిపిస్తోంది.

    సినీప్రపంచానికి పరిచయం చేయడానికి

    సినీప్రపంచానికి పరిచయం చేయడానికి

    శ్రీదేవి ఐదు పదుల వయసులో ఉరుకులు పరుగులతో కనిపించారు. తన కుమార్తెలని సినీ ప్రపంచానికి పరిచయం చేసి హీరోయిన్లని చేయాలనే ఉద్దేశంతో ఆమె ప్రతి ఈవెంట్ కు వారిని వేటపెట్టుకుని వెళ్లేవారు. శ్రీదేవి బాలీవుడ్ లోని ప్రతి వేడుకలో బిజీగా కనిపించేవారు.

    ఆ ఒత్తిడి కూడా

    ఆ ఒత్తిడి కూడా

    శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ ప్రస్తుతం డెబ్యూ మూవీ దడక్ లో నటిస్తోంది. దీనితో జాన్వీ భవిషత్తు గురించి శ్రీదేవిలోఆందోళన ఇంకా పెరిగింది. తనకున్న స్టార్ డమ్ ని మ్యాచ్ చేసేలా నటించగలుగుతుందా, తొలి చిత్రం ఎలా ఉండబోతోంది లాంటి ఒత్తిడులు శ్రీదేవిపై పనిచేసి ఉంటాయని అంచనా వేస్తున్నారు.

    English summary
    One more reason for Sridevi death. Het Stress is main reason.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X