సీమ గెటప్‌లో ఎన్టీఆర్, మళ్ళీ లీక్.. రెండు కళ్ళు సరిపోవంతే!
Recommended Video

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకుడు. వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది. ఫస్ట్ లుక్ తోనే ఈ చిత్రంపై అంచనాలు చేరాల్సిన స్థాయికి చేరిపోయాయి. తాజగా ఈ చిత్రానికి లీకుల దెబ్బ తగులుతున్నా ఫాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇటీవల లీకైన ఎమోషనల్ లుక్ సోషల్ మీడియాలో సునామి సృష్టించింది. తాజగా మరో స్టిల్ లీకై వైరల్ అవుతోంది.

రాయలసీమ నేపథ్యంలో
అరవింద సమేత చిత్రం రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలుస్తాయని సమాచారం.

సీమ గెటప్
ఎన్టీఆర్ రాయలసీమ యువకుడిగా ఎలా కనిపిస్తాడని ఆసక్తి చాలా ఉత్కంఠ రేపుతోంది. ఆ తరహా పాత్ర ఆది చిత్రంలో ఎన్టీఆర్ చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు. అరవింద సమేత చిత్రంలో ఎన్టీఆర్ సీమ లుక్ ఇదే అంటూ సోషల్ మీడియాలో పిక్ వైరల్ అవుతోంది. తెల్లటి ఖద్దరు కుర్తా ధరించిన ఎన్టీఆర్ రాయల్ గా నడచి వెళుతున్నాడు.

పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్
లీకుల బెడద చిత్ర యూనిట్ ని కలవర పెడుతున్నా ఫాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరో చిత్ర విశేషాలు ముందే ఏదో విధంగా తెలియడంతో సంబర పడుతున్నారు . ఎన్టీఆర్ సీమ లుక్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదని కామెంట్స్ పెడుతున్నారు.

దసరా బరిలో
దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదుల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. నాగబాబు ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











