ఆరెంజ్ గురించి మరో భయంకరమైన నిజం...

By Sindhu

రామ్ చరణ్ ఆరెంజ్ చిత్రం విడుదల దగ్గరపడే కొద్దీ అటు మెగా ఫ్యాన్ ఇతర ఫ్యాన్స్ ఈ చిత్రం చూడాలనే క్రేజ్ పెరగడంతో పాటు ఈ చిత్రంలో మగధీర లాంటి విశేషమేమైనా ఉందేమోనని ఫ్యాన్స్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ చిత్రం గురించి రకరకాలైన రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. చాలా మంది కథ ఇదే నంటూ ప్రచారం చేస్తుంటే మరికొందరేమో ఈ ప్రచారానిక కాస్త భయంకరమైన వైల్డ్ గెస్ లు జత చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే రేపు విడుదలకాబోయే 'ఆరెంజ్" చిత్రం చూడాల్సిందే.

అదేంటంటే మొదటి హీరోయిన్ గా జెనీలియా నటిస్తోన్న విషయం తెలిసిందే, ఇందులో జెనీలియా క్యారెక్టర్ మూగదని సమాచారం శరవేగంగా ప్రచారం జరగుతోంది. ఈ సీక్రెట్ ను లీక్ చెయ్యకుండా సినిమా విడుదలయ్యేవరకూ దాచి ఉంచాలని చిత్ర బృందం అనుకుంటోందని, అయితే సెన్సార్ జరిగిన తర్వాత ఈ సీక్రెట్ బయటకు పొక్కిందని అనుకుంటున్నారు. ఒకవేళ నిజంగా ఇది నిజమే అయితే కనుక 'ఆరెంజ్" మీద ఆశలు వదలేసుకోవచ్చు. ఇప్పటికే మరీ క్లాస్ సినిమాలా ఉంది, మగధీర తర్వాత కరెక్ట్ సినిమా కాదేమో అని ఈ చిత్రం గురించి పలురకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మళ్లీ వీటికి తోడు ఈ బెబ్బేబ్బేలు కూడా నిజమైతే మాత్రం ఆరెంజ్ కి భారీ డ్యామేజ్ జరుగుతుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో రేపటి దాకా వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X