నాగబాబు, జగపతి బాబు.. ఎన్టీఆర్ 'అరవింద సమేతలో మరో కీలక నటుడు!
Recommended Video

ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న తొలి చిత్రం ఇది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించబోతున్నాడు. అరవింద సమేత చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వరుసగా విజయాలు సాధిస్తున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరో భారీ హిట్ పై కన్నేశాడు. జగపతి బాబు, నాగబాబు వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా మరో ప్రముఖ నటుడు అరవింద సమేత షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

అంచనాలు పెంచేసిన ఫస్ట్ లుక్
అరవింద సమేత ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆ మధ్యన విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ అదరగొట్టేసాడు. ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

భారీ తారాగణం
ఈ చిత్రంలో జగపతి బాబు, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా నటిస్తారని సమాచారం.

మరో ప్రముఖ నటుడు
అరవింద సమేత చిత్రంలో మరో ప్రముఖ నటుడు నటిస్తున్నాడు. శుభలేఖ సుధాకర్ ఇటీవలకే చిత్ర షూట్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. శుభలేఖ సుధాకర్ నటిస్తున్న చిత్రాల సంఖ్య ప్రస్తుతం బాగా తగ్గింది. అతడి కెరీర్ తిరిగి పుంజుకోవడానికి అరవింద సమేత చిత్రం బాగా ఉపయోగపడుతుంది.

పూజ హెగ్డే హీరోయిన్ గా
ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోలతో నటిస్తున్న పూజా హెగ్డే ఈ చిత్రంలో కూడా హీరోయిన్. పూజా హెగ్డే తో పాటు ఇషా రెబ్బా ఈ చిత్రంలో మరో కీ రోల్ ప్లే చేయనుంది.


Click it and Unblock the Notifications











