»   » సన్నీ లియోన్‌తో హీరో రానా ‘వన్ నైట్ స్టాండ్’ (ఫోటోస్)

సన్నీ లియోన్‌తో హీరో రానా ‘వన్ నైట్ స్టాండ్’ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి బాలీవుడ్లో ‘వన్ నైట్ స్టాండ్' ఆనే సినిమా చేస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సైన్ చేసినట్లు రానా అప్పట్లో అంగికరించినప్పటికీ.... బాహుబలి సినిమా షూటింగులో బిజీగా ఉండటం వల్ల తప్పుకున్నట్లు తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయం ఏమిటంటే ఈచిత్రంలో హీరోయిన్ గా మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తుండటం. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు నెట్లో దర్శనమిస్తున్నాయి. పోస్టర్లలో ప్రత్యేకంగా సన్నీ లియోన్, రానా నటిస్తున్న సినిమా అని ఉండటం గమనార్హం.

మరి ఈ పోస్టర్లు రానా సినిమా తప్పుకోక ముందు క్రియేట్ చేసినవా? లేక బాహుబలి సినిమా తర్వాత రానా మళ్లీ డేట్స్ అడ్జెస్ట్ చేసి నటించాడా? అనేది తేలాల్సి ఉంది. ‘బాహుబలి' సినిమా రానా కెరీర్లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింటుగా ఉంటుందని అంతా అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇపుడు వన్ నైట్ స్టాండ్ మూవీ తెరపైకి రావడం గమనార్హం.

ఇక ‘వన్ నైట్ స్టాండ్' సినిమా వివరాల్లోకి వెళితే...ఈ చిత్రానికి జాస్మిన్ డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. భవానీ ఐయ్యర్ ఈ సినిమాకు కథ అందించారు. ప్రదీప్ శర్మ నిర్మాత. స్విస్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల చేసేందకు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా ‘వన్ నైట్ స్టాండ్' సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి......

రానా-సన్నీ

రానా-సన్నీ


రానా-సన్నీ లియోన్ నటిస్తున్న సినిమా అంటూ పోస్టర్లలో ఉండటం గమనార్హం.

శృంగార నేపథ్యం...

శృంగార నేపథ్యం...


సన్నీ లియోన్ తో కలిసి ఒక రాత్రి గడపడటం అనే కాన్సెప్టుతో శృంగార ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

ఏప్రిల్ 8న రిలీజ్

ఏప్రిల్ 8న రిలీజ్


వన్ నైట్ స్టాండ్ చిత్రాన్ని ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మస్తీ జాదె

మస్తీ జాదె


మరో వైపు సన్నీ లియోన్ నటించిన సెక్స్ -కామెడీ చిత్రం ‘మస్తీజాదె' లాస్ట్ వీకెండ్ విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.

English summary
One Night Stand is a 2016 upcoming Bollywood romantic drama film, written by Bhavani Iyer and directed by Jasmine D'Souza.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu