రాజమౌళిలో ఆ ఒక్క విషయం కీరవాణికి నచ్చదట.. జక్కన్న కాస్త మారాల్సిందే!

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని జనాల్లో ఒక ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది. అపజయం లేని దర్శకుడిగా దేశమంతా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈ లాక్ డౌన్ లో వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా మారుతున్నాడు. తన పర్సనల్ లైఫ్ గురించే కాకుండాసినిమాలకు సంబంధించిన కొత్త తరహా విషయాలను కూడా చెబుతున్నాడు.

కీరవాణి కూడా..

కీరవాణి కూడా..

మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ఎమ్.కీరవాణి కూడా మీడియాకు లైవ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ బిజిగా మారారు. RRR సినిమాకు సంబంధించిన విశేషాలను వివరిస్తూ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమా ఉంటుందని అన్నారు. సినిమాలో ఇద్దరి హీరోలను సమానంగా చూపించడమే కాకుండా మరికొన్ని పాత్రల ఎలివేషన్ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు.

 రాజమౌళిలో నచ్చని విషయం..

రాజమౌళిలో నచ్చని విషయం..

రాజమౌళి మొదటి సినిమా నుంచి కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. కజిన్స్ కావడంతో చిన్నప్పటి నుంచి ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అయితే రాజమౌళిలో కీరవాణికి ఒకే ఒక్క విషయం నచ్చదట. ఎక్కువగా చిన్న పిల్లల తరహా సినిమాలు చూస్తుంటాడు.. కాస్త ఉన్నతమైన మెచ్చుర్డ్ సినిమాలు చూద్దాం రమ్మని అడిగితే.. అస్సలు రాడు.. అదే విషయం అతనిలో తనకు నచ్చదని కీరవాణి తెలిపాడు.

ఫారెస్ట్ గంప్ ఇంతవరకు చూడలేదట..

ఫారెస్ట్ గంప్ ఇంతవరకు చూడలేదట..

కొన్నేళ్ల క్రితం వచ్చిన అమెరికన్ కామెడీ డ్రామా ఫారెస్ట్ గంప్ సినిమా చూడమని అడిగితే ఇంతవరకు ఆ సినిమా చూడలేదని కీరవాణి రాజమౌళిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. టామ్ హాంక్స్ నటించిన ఆ సినిమాను చూడని సినీ ప్రియులు ఉండరని చెప్పిన కీరవాణి రాజమౌళికి చూడమని సజెస్ట్ చేస్తే ఆ సినిమా తరువాత చూస్తానని చెప్పి వేరే సినిమాలు చూస్తుంటాడాని అది కొంత మారితే బావుంటుందని కామెంట్ చేశారు.

Recommended Video

RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster
 రాజమౌళిలో నచ్చే విషయం..

రాజమౌళిలో నచ్చే విషయం..

ఒక పని మొదలుపెడితే ఆ పనే చేస్తుంటాడు. ఏకాగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆలోచన తప్పకుండా ఒక సంకల్పంతో కష్టపడి పని చేస్తుంటాడు. రాజమౌళిలో ఆ విషయం నాకు బాగా నచ్చుతుంది అని కీరవాణి తెలియజేశారు. ఇకపోతే RRR సినిమాలో మ్యూజిక్ కూడా చాలా కొత్తగా ఉండబోతోందని చెప్పిన కీరవాణి ఇద్దరు హీరోల పాత్రలు ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తాయని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X