వెయ్యిమంది రామ్ చరణ్ లు కలిసినా ఒక్క చిరంజీవి కాడు
"వన్ ధౌజెండ్ రామ్ చరణ్స్ కెనాట్ మేక్ వన్ చిరంజీవి" అంటూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. అలాగే "చిరంజీవి కొత్త అవతారంలో పవన్ కళ్యాణ్ కన్నా యంగ్ గా ఉన్నారు" అని ట్వీట్ చేసారు. చిరంజీవి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫొటోలను ఇప్పుడే చూసానని, ఆయన కొత్త లుక్ పెంటాస్టిక్ అని అన్నారు. అయితే హఠాత్తుగా రామ్ గోపాల్ వర్మ ఇలా చిరంజీవి భజన చేస్తున్నాడేమిటా అని అంతా ఆశ్చర్యపోతున్నారు. కొందరైతే అక్కడ ముంబైలో ఇక అవకాశాలు లేవు కాబట్టి ఇక్కడే సెటిల్ కావాలనుకుంటున్నాడు. అందుకే చిరంజీవిని ప్రశంసించటం ద్వారా ఆ క్యాంప్ ని మంచి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అంటున్నారు. అలాగే ఆ మధ్య చిరంజీవి దొర..ది లార్డ్ అనే చిత్రం చేస్తానని కూడా ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిరంజీవి రామ్ చరణ్ తేజ్ రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ chiranjeevi ram charan teja ram gopal varma pawan kalyan


Click it and Unblock the Notifications