twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘కడలి’కి పోటీగా ఫిబ్రవరి 1న రామ్ ‘ఒంగోలు గిత్త’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా రూపొందుతున్న 'ఒంగోలు గిత్త' చిత్రం మణిరత్నం తాజా సినిమా 'కడలి'తో పోటీ పడుతూ ఫిబ్రవరి 1న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు విడుదల విషయాన్ని ఖరారు చేస్తూ నిర్మాతలు ప్రకటన జారీ చేసారు.

    ఈ సందర్భంగా నిర్మాత నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'మా ఒంగోలు గిత్త షూటింగుతో పాటు ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయి. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మా ఒంగోలు గిత్త నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు.

    రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

    English summary
    Ram, Kriti Karbandha starrer Ongole Githa is going to release on 1st February. Bommarillu Bhaskar who has done class and family movies like Bommarillu, Parugu and Orange is directing a mass film for the first time. BVSN Prasad producer of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X