‘ఒంగోలు గిత్త’ షూటింగులో గాయపడ్డ హీరో రామ్
హైదరాబాద్ : 'ఒంగోలు గిత్త' షూటింగులో ఆచిత్ర కథానాయకుడు రామ్ గాయపడ్డారు. సినిమాలో మిగిలి ఉన్న కొన్ని ఫైట్ సీన్లను చిత్రీకరిస్తుండగా అతని కాలి మడమ భాగంలో గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 4 వారాల పాటు రెస్టు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. గతంలో ఇతే తరహాలో దేవదాసు చిత్రం షూటింగులో నాన్ చాక్ ఫైట్ చేస్తుండగా రామ్ గాయపడ్డాడు.
ఈ సినిమాను ఫిబ్రవరి 1 కల్లా ప్రేక్షకుల ముందుకు తేవడానికి నిర్మాతలు ప్లాన్ చేసారు. రామ్ కాలికి గాయం అయిన నేపథ్యంలో చిన్న చిన్న సీన్లు పెండింగులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'బొమ్మరిల్లు' 'పరుగు'లాంటి కుటుంబ కథా చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు భాస్కర్ తొలిసారి చేస్తున్న మాస్ అంశాలున్న చిత్రంగా 'ఒంగోలు గిత్త'ను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ తగినట్టుగానే రామ్ పాత్ర చిత్రణ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఆయన ఇమేజ్‌కు తగిన కథాంశమిది. మిర్చీ యార్డ్‌లో పనిచేసే కథానాయకుడు అన్యాయాల్ని ఎదిరించి తనను నమ్ముకున్న వారికి ఏ విధంగా మేలు చేశాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.
ప్రకాష్‌రాజ్, అభిమన్యుసింగ్, బ్రహ్మానందం, ఆహుతివూపసాద్, అజయ్, రఘుబాబు, రమావూపభ తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.విపకాష్‌కుమార్, ఫైట్స్: సెల్వ, సినిమాటోక్షిగఫీ: వెంక పాటలు: వనమాలి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications











