పౌరుషాల ‘ఒంగోలు గిత్త’ మళ్లీ వెనకడుగు!

By Bojja Kumar

'పౌరుషంలో ఒంగోలు గిత్తకు సాటేది లేదు...మా 'ఒంగోలు గిత్త' చిత్రంలో హీరో రామ్ పాత్ర చిత్రణ కూడా అదే విధంగా పవర్‌ఫుల్‌గా వుంటుందని చెబుతున్న.....ఆ చిత్ర నిర్మాతలు సినిమా విడుదల, ఆడియో విడుదల విషయంలో మాత్రం వెనకడుగులే తప్ప ముందడుగులు మాత్రం వేయడం లేదు.

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈచిత్రం ఆడియో వేడుక చివరకు జనవరి 12న నిర్ణయించారు. అయితే ఈ సారి కూడా మళ్లీ ఆడియో విడుదల కార్యక్రమం వాయిదా పడింది. అనుకోని కారణాల వల్ల ఈ రోజు ఆడియో విడుదల చేయలేక పోతున్నామని ప్రకటించింది ఈ చిత్ర నిర్మాణ సంస్థ. త్వరలో ఆడియో విడుదల తేదీ, సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

శ్రీ వెంక సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్.ఎన్‌పసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'బొమ్మరిల్లు' 'పరుగు'లాంటి కుటుంబ కథా చిత్రాల్ని రూపొందించిన దర్శకుడు భాస్కర్ తొలిసారి చేస్తున్న మాస్ అంశాలున్న చిత్రమని' చెప్పారు.

టైటిల్ తగినట్టుగానే రామ్ పాత్ర చిత్రణ చాలా పవర్‌ఫుల్‌గా వుంటుంది. ఆయన ఇమేజ్‌కు తగిన కథాంశమిది. మిర్చీ యార్డ్‌లో పనిచేసే అతను అన్యాయాల్ని ఎదిరించి తనను నమ్ముకున్న వారికి ఏ విధంగా మేలు చేశాడన్నదే మా చిత్ర ఇతివృత్తం' అన్నారు దర్శకుడు భాస్కర్.

ప్రకాష్‌రాజ్, అభిమన్యుసింగ్, బ్రహ్మానందం, ఆహుతివూపసాద్, అజయ్, రఘుబాబు, రమావూపభ తదితరులు ముఖ్యపావూతల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.విపకాష్‌కుమార్, ఫైట్స్: సెల్వ, సినిమాటోక్షిగఫీ: వెంక పాటలు: వనమాలి, సమర్పణ: భోగవల్లి బాపినీడు, కథ-వూస్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X