‘ఒంగోలు గిత్త’ సెన్సార్ రిపోర్ట్
హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్-కృతి కర్బంద జంటగా 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఒంగోలు గిత్త' చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈచిత్రానికి సెన్సార్ బోర్డు సభ్యులు 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. నిర్మాత నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈచిత్రం ఫిబ్రవరి 1న గ్రాండ్ గా విడుదలవుతోంది.
సినిమాలో యాక్షన్ సన్నివేశాలు, రొమాటిక్స్ సీన్స్ పరిమితికి మించి ఉన్నాయని..... కొన్ని సీన్లుకు కత్తెర వేసి యూనివర్సల్ సర్టిఫికెట్ ఇవ్వాలని బోర్డు యోచించినా వాటిని తొలగించడానికి దర్శక నిర్మాతలు ఒప్పుకోక పోవడంతో సెన్సార్ బోర్డు సభ్యులు ఈ చిత్రం పెద్దలు మాత్రమే చూడదగినది అంటూ 'A' సర్టిఫికెట్ జారీ చేసారని స్పష్టం అవుతోంది.
సినిమా గురించి నిర్మాత ఇటీవల మాట్లాడుతూ..'మా ఒంగోలు గిత్త చిత్రాన్ని ఫిబ్రవరి 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది. బొమ్మరిల్లు, పరుగు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ని రూపొందించిన భాస్కర్ తీస్తున్న ఫ్యామిలీ టచ్ తో ఉండే మంచి మాస్ ఎంటర్ టైనర్ ఇది. రామ్ ఇమేజ్ కి తగినట్లుగా ఎనర్జిటిక్ గా ఉంటూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈచిత్రంలో ఉంటాయి. రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మా ఒంగోలు గిత్త నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు.
రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications











