‘ఒంగోలు గిత్త’ టాక్ ఏమిటి?
హైదరాబాద్: ఎనర్జిటిక్ హీరో రామ్, కృతి కర్బంద జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన 'ఒంగోలు గిత్త' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా విడుదలైంది. 'ఆరెంజ్' ప్లాపుతో భాస్కర్, 'ఎందుకంటే ప్రేమంట' బాక్సాఫీసు వద్ద బోల్తా పడిన నేపథ్యంలో.... ఈ ఇద్దరికి 'ఒంగోలు గిత్త' సినిమా ప్రతిష్టాత్మకంగా మారింది.
అయితే 'ఒంగోలు గిత్త' సినిమా టాక్ పరిశీలిస్తే...... ఈ సినిమా కూడా నిరాశ పరిచే విధంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. పూర్తి మాస్ నేపథ్యంలో ఈ చిత్రం క్లాస్ ప్రేక్షకులను మెప్పించడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది. సినిమా కథ 30 ఏళ్ల కిందటి కథలా ఉండటం, స్క్రీప్లే కూడా ఆకట్టుకునే విధంగా లేక పోవడం మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెగెటివ్ టాక్ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయో మరో వారం ఆగితే గానీ చెప్పలేం.
అయితే రామ్ పెర్ఫార్మెన్స్ మాత్రం బాగుందని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీశాడు. హీరోయిన్ కృతి కర్బంద కేవలం గ్లామర్ ప్రదర్శనే తప్ప నటనకు పెద్దగా అవకాశం లేకుండా పోయింది. ప్రకాష్ రాజ్ పెర్ఫార్మెన్స్ వంకలు పెట్టాల్సిన పని లేదని....దర్శకుడు భాస్కర్ దర్శకత్వానికి పూర్తి న్యాయం చేయలేక పోయాడనే టాక్ వినిపిస్తోంది.
రామ్, కృతి కర్బందా, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, డా. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, అజయ్, రఘుబాబు, రమాప్రభ ముఖ్య పాత్రలు చేషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్స్: సెల్వ, ఫోటోగ్రఫీ: వెంకటేష్, ఆర్ట్: కె. కదిర్, పాటలు: వనమాలి, ప్రొడక్షన్ కంట్రోలర్: పి. రామ్ మోహన్ రావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: భాస్కర్.


Click it and Unblock the Notifications











